- ఐటి మినహాయింపు స్వల్పంగానే పెంపు
- ధరల పెంపుతో పోలిస్తే నామమాత్రం
- అటకెక్కిన స్థాయి సంఘం సిఫార్సు
ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని స్వల్పంగానే పెంచిన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ దాన్నే 'గొప్ప మేలు'గా అభివర్ణించారు. వేతన జీవులకు, చిన్న తరహా పన్ను చెల్లింపుదారులకు పన్ను మినహాయింపు పరిమితిని కేవలం రూ.20 వేల వరకు మాత్రమే పెంచారు. ఓ పక్క నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు, డీజిల్ రేట్లు విపరీతంగా పెరుగుతున్న స్థితిలో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి నామమాత్రమనే చెప్పాలి. ప్రత్యక్ష పన్నుల కోడ్ (డిటిసి)ను పరిశీలించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం పన్ను మినహాయింపు పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలని సిఫార్సు చేయగా ఆర్థిక మంత్రి దాన్ని పట్టించుకోలేదు.
వ్యక్తులకు ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుత బడ్జెటులో రూ.1.80 వేల నుంచి కూ.2 లక్షలకు పెంచారు. 20 శాతం పన్ను స్లాబ్ పరిధిలో ఉన్నవారికి మినహాయింపును రూ.10 లక్షలకు పెంచారు. ప్రస్తుతం ఈ పరిమితి రూ.8 లక్షలుగా ఉంది. డిటిసిని పరిశీలించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం పన్ను మినహాయింపు పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలని సిఫార్సు చేయగా ప్రణబ్ దాన్ని రూ.2 లక్షలకు పరిమితం చేశారు. పన్ను నుంచి వడ్డీ ఆదాయాన్ని రూ.10 వేల వరకు మినహాయిస్తూ బడ్జెటులో ప్రతిపాదించారు. సీనియర్ పౌరులకు (60 నుంచి 80 ఏళ్ల వయసు) ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.50 లక్షలకు పెంచారు. 80 ఏళ్లకు పైబడిన వారికి రూ.5 లక్షలకు పెంచారు. ప్రత్యక్ష పన్నుల కోడ్ (డిటిసి) అమలుకు చర్యలు తీసుకోవడంలో భాగంగా పన్ను మినహాయింపు పరిమితిని పెంచినట్లు ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ప్రత్యక్ష పన్నులపై తన ప్రతిపాదనల కారణంగా రూ.4,500 కోట్ల ఆదాయం కోల్పోతామని చెప్పారు. చిన్నతరహా పన్ను చెల్లింపుదారులకు తాను చేసిన ప్రతిపాదనలు ఎంతో సహాయకారిగా ఉంటాయన్నారు.
ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి (వ్యక్తులకు)
ఆదాయం పన్ను చెల్లింపు
రూ.2 లక్షలు-5 లక్షల మధ్య 10 శాతం
రూ.5 లక్షలు-10 లక్షల మధ్య 20 శాతం
రూ.10 లక్షలకు పైన 30 శాతం
ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి
(సీనియర్ సిటిజన్లకు)
రూ.2.5 లక్షలు-రూ.5 లక్షల మధ్య 10 శాతం
రూ.5 లక్షలు-రూ.10 లక్షల మధ్య 20 శాతం
రూ.10 లక్షలకు పైన 30 శాతం
80 ఏళ్లు పైబడిన వారికి ఆదాయపు పన్ను మినహాయింపు పరిమతిని రూ. 5 లక్షలకు పెంచారు. ఈ కేటగిరిలో రూ.5 నుంచి 10 లక్షల వరకు 20 శాతం, రూ.10 లక్షలకు పైన 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ప్రస్తుత మినహాయింపులోనే ఆర్థిక బీమా తగ్గింపును కూడా చేర్చుకోవచ్చు. ఆరోగ్య పరీక్షలకు అయ్యే ఖర్చుల్లో రూ.5 వేల వరకు తగ్గింపుగా చూపవచ్చు.
వ్యాపారం ద్వారా ఎటువంటి ఆదాయం లేని సీనియర్ పౌరులను ముందస్తు పన్ను చెల్లింపు నుంచి మినహాయించారు.
ఇక కార్పొరేట్‌కు సంబంధించిన విషయాల్లో ఎటువంటి మార్పులూ లేవని ప్రణబ్ చెప్పారు.
2011 -12 రెవెన్యూ అంచనాలు : 2012 -13 బడ్జెట్ అంచనాలు
పన్నుల్లో రాష్ట్ర వాటా 20,986 కోట్లు
కేంద్ర ప్రభుత్వం విధించే వివిధ పన్నుల్లో రాష్ట్రం వాటా కింద 2012-13లో 20,986 కోట్ల రూపాయలు లభించ నున్నాయి. గత బడ్జెట్‌తో పోల్చితే ఇది 3235 కోట్ల రూపాయలు అధికం. శుక్రవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఈ వివరాలను పొందుపరిచారు. అన్ని రాష్ట్రాలకూ కలిపి సుమారుగా 3 లక్షల కోట్ల రూపాయలను పన్ను వాటా కింద కేంద్రం చెల్లించనుంది. ఇందులో రాష్ట్రం వాటా 6.937 శాతం ( 20,986 కోట్లు). ఈ మొత్తంలో కార్పొరేషన్ పన్ను వాటాగా 7667 కోట్ల రూపాయలు, ఆదాయ పన్ను వాటాగా 4148 కోట్లు, ఆస్తి పన్ను వాటాగా 27 కోట్లు, కస్టమ్స్ వాటాగా 3815 కోట్లు, ఎక్సైజ్ వాటాగా 2612 కోట్లు లభించ నున్నాయి. సేవా పన్ను వాటా కింద మరో 2713 కోట్ల రూపాయలు దక్కనున్నాయి. మార్చి 31తో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను వాటా కింద మొత్తంగా 17751 కోట్ల రూపాయలు దక్కనున్నాయి. గత బడ్జెట్‌లో రాష్ట్ర పన్ను ఆదాయ వాటాను 17584 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. అదనంగా వచ్చిన 166 కోట్ల రూపాయల వాటా ఆదాయాన్ని ప్రస్తుతం చెల్లించనున్నారు.
రాష్ట్రపతి భవన్‌కు కేటాయింపుల్లో పెంపు
రాష్ట్రపతి భవన్ నిర్వహణకు అవసరమైన నిధుల్లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నామ మాత్రంగా రు 8 లక్షల పెరపును ప్రకటించారు. గత ఏడాది రాష్ట్రపతి భవన్ నిర్వహణా వ్యయం 19.04 కోట్లు కాగా ఈ ఏడాది బడ్జెట్‌లో దానిని 19.12 కోట్లుగా అంచనా వేశారు. ఈ పద్దును బడ్జెట్‌లో 'ఇతర ఖర్చుల'కింద చూపారు. ఇతర ఖర్చులు అంటే రాష్ట్రపతి భవన్ నిర్వహణా వ్యయం, సిబ్బంది, అధికారుల వేతనాలు, వాహనాల కొనుగోలు, నిర్వహణ వంటివి కలిసి వుంటాయి. రాష్ట్రపతి సచివాలయానికి ఈ ఏడాది రు.35 లక్షల నామమాత్రపు పెంపుదలను ప్రకటించారు. ఇందులో కార్యాలయ నిర్వహణా ఖర్చులు, సిబ్బంది, ఇతర ఖర్చులు వుంటాయని బడ్జెట్ ప్రతిపాదనలు వెల్లడిస్తున్నాయి. అయితే రాష్ట్రపతి నెలసరి వేతనం రు.18 లక్షల్లో మాత్రం ఎటువంటి మార్పునూ ప్రకటించలేదు. రాష్ట్రపతి కోసం గత ఏడాది కేటాయించిన నిధులను రు.29.81 లక్షల నుండి ఈ ఏడాది రు.30.24 లక్షలకు (రు.43 లక్షలు- 1.4 శాతం) పెంచారు.
విశాఖ ఉక్కుకు కోత
- సింగరేణికి 3,220 కోట్లు
ఆంధ్రప్రదేశ్‌కే కాక దేశానికే ప్రతిష్టాత్మకమైన విశాఖ ఉక్కు కర్మాగారానికి (ఆర్‌ఐఎన్‌ఎల్ -రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోత విధించింది. విశాఖ ఉక్కుకు ప్రస్తుత బడ్జెట్‌లో కేవలం 1942 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. గత ఏడాది బడ్జెట్‌లో ఘనంగా 3046 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ...సవరించిన బడ్జెట్ ప్రకారం వాస్తవానికి ఇచ్చింది 1964 కోట్ల రూపాయలు మాత్రమే. 2010-11 బడ్జెట్‌లోనూ 2901 కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్రం, తాజా బడ్జెట్‌లో భారీగా కోత విధించింది. రాష్ట్రంలో మరో ప్రధానమైన ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి కాలరీస్‌కు మాత్రం ఈ బడ్జెట్‌లో నిధులు పెరిగాయి. ప్రస్తుత బడ్జెట్‌లో సంస్థకు 3,220 కోట్ల రూపాయలు కేటాయించారు. గత బడ్జెట్‌లోనూ 2,804 కోట్ల రూపాయలను కేటాయించిన ప్రభుత్వం..వాస్తవానికి ఖర్చు చేసింది మాత్రం 1389 కోట్ల రూపాయలే. ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రణబ్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
ఇతర సంస్థలకు నిధులివీ.. ( కోట్ల రూపాయల్లో)
బ్రాకెట్లలో ఉన్నవి గత ఏడాది నిధులు
బిహెచ్‌ఇఎల్ : 1696.00 (1407 )
మణుగూరు భారజల కేంద్రం : 251.00 (286)
సాలార్‌జంగ్ మ్యూజియం : 18.50 (17.20 )
విశాఖ ఎగుమతుల కేంద్రం : 5.70 ( 4.60 )
విశాఖ పోర్ట్ ట్రస్ట్ : 322.00
శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం : 437.00
బహుళజాతి సంస్థల చొరబాటుకే...
- రక్షణ బడ్జెట్‌లో కేటాయింపుల పెరుగుదల
- స్వావలంబనకూ, స్వయంవృద్ధికీ విఘాతం
రక్షణ శాఖ కేటాయింపులు పెరుగుదల జాతి బహుళజాతి సంస్థల చొరబాటుకు 2012-13 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన 1,93,407 కోట్ల రూపాయల బడ్జెట్ పెంపుదల ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయింపులకు సుమారు 17 శాతం పెరుగుదల ఉంది. ఈ పెరుగుదలలో సింహభాగం విదేశాల నుంచి ఆయుధాల కొనుగోలుకు వెచ్చించడం వల్ల మన దేశంలో రక్షణ రంగంలో ఉత్పత్తులు చేయకుండా అడ్డుకోవడమే. డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ ప్రొసీజర్ 2011 ప్రకారం బడ్జెట్‌లో 60 శాతం దిగుమతికే పెద్దపీట వేశారు. తాజాగా జాయింట్ వెంచర్ పేరిట రక్షణ ప్రభుత్వరంగ పరిశ్రమలలో పబ్లిక్ ప్రయివేట్ పార్టిసిపేషన్‌కు నిర్ణయం, రక్షణ విధానాలలో బహుళజాతి సంస్థలకు, దేశీయ బడా పారిశ్రామిక వేత్తలకు అవకాశమివ్వడమే. ఈ చర్య వల్ల స్వావలంబనకూ, స్వయంవృద్ధికీ విఘాతం కలుగుతుంది. రానున్న పదేళ్ళ కాలంలో 100 బిలియన్ డాలర్లు రక్షణ పరికరాల కొనుగోలు గురించి కేటాయించడం అనగా సుమారు 5 లక్షలా 55 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకోవడానికి ద్వారాలు తెరవడమే. ఇదే మొత్తాన్ని మనదేశంలో ఉన్న పరిశ్రమలకు కేటాయించడం ద్వారా ప్రస్తుతమున్న 51 డిఆర్‌డిఓ ల్యాబ్స్‌కు అదనంగా మరో 50 ల్యాబ్స్, మరో 10 రక్షణ ప్రభుత్వరంగ పరిశ్రమలు, అలాగే 20 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను అదనంగా నిర్మించుకోవడం వల్ల మూడు లక్షల మందికి నేరుగా ఉద్యోగావకాశాలు, పరోక్షంగా మరో ఐదు లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. రక్షణ రంగంలో బహుళజాతి సంస్థల ద్వారా విదేశీ ప్రత్యక్ష నిధులు రాబట్టడం ఈ కీలక రంగాన్ని వీరి స్వాధీనంలోకి నెట్టడం ద్వారా అమెరికాకు దాసోహం కావడమే. రానున్న రోజుల్లో న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ నుంచి రక్షణ పారిశ్రామిక విధానాన్ని అమెరికా రక్షణ వ్యవస్థ పెంటగాన్‌కు అప్పజెప్పడమైనది. ప్రభుత్వం యొక్క ఈ చర్య అత్యంత గర్హనీయం. నెహ్రూ, ఇందిరాగాంధీ వారసులమని చెప్పుకుంటున్న ఈ పాలకులు వీరు కన్న కలలైన స్వావలంబన, స్వయం వృద్ధికి తిలోదకాలివ్వడమే. రక్షణ రంగంలో జాయింట్ వెంచర్ పేరిట ప్రయివేటు పెట్టుబడులు, ఎఫ్‌డిఐ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలి. రక్షణ రంగాన్ని కాపాడాలి.
భారీ బడ్జెట్‌లో కానరాని వ్యవసాయం
2012-13బడ్జెట్ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెడుతూ వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసినట్లు పార్లమెంటులో ప్రకటించారు. గత బడ్జెట్‌పై 1.62లక్షల కోట్లు పెంపుదల చేస్తూ మొత్తం బడ్జెట్ 14,90,925 కోట్ల వ్యయంతో ప్రవేశపెడుతూ వ్యవసాయ రంగానికి రూ.20,208 కోట్లు కేటాయింపు చూపారు. గత సంవత్సరంపై 18 శాతం వృద్ధి వుంది. రాష్ట్రీయ కృషి వికాస్‌యోజనకు రు.9,217 కోట్లు, పంట రుణాల కొరకు రు.1లక్ష కోట్లు పెంపుదల చేస్తూ రు.5.75 లక్షల కోట్లు లక్ష్యంగా నిర్ణయించారు. పై నిధులతో వ్యవసాయ రంగం అభివృద్ధి గణనీయంగా పెరుగుతుందని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా సెలవిచ్చారు.
గత సంవత్సరం 4.75 లక్షల కోట్లు రుణాలిస్తామని బడ్జెట్‌లో ప్రకటించగా, నవంబర్ నాటికి ఇచ్చిన రుణం 2.94 లక్షల కోట్లు మాత్రమే.
.............ఇప్పటి వరకూ దేశంలో 64 సాధారణ వార్షిక బడ్జెట్లు, 12 మధ్యంతర బడ్జెట్లు, నాలుగు ప్రత్యేక సందర్భ బడ్జెట్లను (మినీ బడ్జెట్లుగా పిలుస్తారు) ప్రవేశపెట్టారు..........
No comments:
Post a Comment