Sunday, December 30, 2012

భారతీయుడిని పట్టాలపైకి నెట్టి చంపిన అమెరికన్ మహిళ


హిందూ ద్వేషంతో భారతీయుడిని పట్టాలపైకి నెట్టి చంపిన అమెరికన్ మహిళ

Erika Menendezఅమెరికాలో న్యూయార్క్ సబ్ వే లో భారతీయుడొకరు దారుణంగా హత్యకు గురయ్యాడు. రైలుకోసం ఎదురుచూస్తున్న అతన్ని ఓ అమెరికన్ మహిళ స్టేషన్ లోకి ప్రవేశిస్తున్న రైలు ముందుకి వెనకనుండి తోసి చంపేసింది. మొదటి, రెండు కంపార్ట్ మెంట్లు అతని మీదుగా పోవడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని సునందో సేన్ గా గుర్తించారు. తనకు హిందువులన్నా, ముస్లింలన్నా ద్వేషమనీ అందుకే అతన్ని చంపేశాననీ అమెరికన్ మహిళ అంగీకరించినట్లుగా న్యూయార్క్ పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 11, 2001 టెర్రరిస్టు దాడులు అనంతరం తాను హిందూ, ముస్లింలపైనా ద్వేషం పెంచుకున్నానని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.
31 యేళ్ళ నిందితురాలు ఎరికా మెనెండెజ్ క్వీన్స్ లో నివశిస్తుండగా 46 సంవత్సరాల సునందో సేన్ కూడా క్వీన్స్ లోనే ఒక చిన్న అపార్ట్ మెంట్ లో ఇతరులతో కలిసి నివసిస్తున్నాడు. అనేక సంవత్సరాల క్రితమే అమెరికాకి వలస వచ్చిన సునందో ఈ మధ్యనే కొలంబియా  యూనివర్సిటీ వద్ద సొంతగా ఒక ప్రింటింగ్ అండ్ కాపీయింగ్ అంగడి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు. అతనికి వివాహం కాలేదనీ అతని తల్లిదండ్రులిద్దరూ చనిపోయారనీ పి.టి.ఐ తెలిపింది. తన మరణం గురించి ఇండియాలోని అతని కుటుంబానికి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఈ దుర్ఘటన క్వీన్స్ స్టేషన్ లో డిసెంబర్ 27 రాత్రి  జరిగింది. పట్టాలకు దగ్గరగా నిలబడి ఉన్న సేన్ ను ఊహించని విధంగా అమెరికన్ మహిళ వెనకినుండి తోసేయడంతో అతనికి తననుతాను రక్షించుకునే అవకాశం కూడా లభించలేదని తెలుస్తోంది. పక్కన ఉన్నవారికి కూడా అతన్ని కాపాడే అవకాశం దొరకలేదనీ, అంతా లిప్తపాటు కాలంలో జరిగిపోయిందనీ తెలుస్తోంది. ట్రైన్ ఢీకొట్టడం వల్ల అనేకచోట్ల తగిలిన మొద్దు గాయాల వలన (multiple blunt force trauma) సేన్ చనిపోయాడని పోలీసు అధికారి బ్రౌన్ చెప్పినట్లుగా ‘ది హిందూ’ తెలిపింది. మొదటి కంపార్ట్ మెంటు అతన్ని ఢీకొట్టగా పట్టాలపై పడిపోయాడని అతనిపై మొదటి రెండు కంపార్టు మెంట్లు వెళ్ళాయనీ పోలీసులు తెలిపారు.
సర్వైలెన్స్ ఫుటేజ్ -న్యూయార్క్ డెయిలీ
సర్వైలెన్స్ ఫుటేజ్ -న్యూయార్క్ డెయిలీ
“ఒక ముస్లింను నేను రైలు పట్టాలపైకి నెట్టాను. ఎందుకంటే నాకు హిందువులన్నా, ముస్లింలన్నా పరమ ద్వేషం. 2001లో జంట టవర్లను కూల్చివేసినప్పటి నుండీ నేను వారిని కొడుతూనే ఉన్నాను” అని మెనెండెజ్ తన స్టేట్ మెంట్ లో పేర్కొన్నదని క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. హత్యా దారుణానికి పాల్పడిన మహిళ రెండు రోజులపాటు పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగింది. ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా శనివారం ఉదయం ఆమెను పట్టుకున్నారు. సాక్షుల వర్ణనల ఆధారంగా ఆర్టిస్టు చేత స్కెచ్ గీయించిన స్కెచ్ నూ, సర్వైలెన్స్ వీడియో భాగాన్నీ పోలీసులు పలుచోట్ల ప్రదర్శించారు. ఆమె గురించి సమాచారం ఇచ్చినవారికి 12,000 డాలర్ల బహుమానం కూడా ప్రకటించారు. బ్రూక్లీన్ బ్రిడ్జ్ పై ఉన్న మహిళను ఒక వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జాతి విద్వేషి మెనెండెజ్ దొరికిపోయింది.
తానే హత్య చేశానని మహిళ అంగీకరించిందని పోలీసు అధికారి పాల్ బ్రౌన్ తెలిపాడు. సేన్ ను ముస్లింగా భావిస్తూ అతన్ని రైలు ముందుకి తోశానని ఆమె పోలీసులకి తెలిపింది. “మెనెండెజ్ చేసిన అత్యంత విద్వేషపూరిత వ్యాఖ్యలను గానీ, విద్వేషంతో ఆమె పాల్పడిన చర్యలను గానీ నాగరిక సమాజం ఎన్నటికీ సహించలేదు” అని పాల్ బ్రౌన్ వ్యాఖ్యానించాడు. “స్టేషన్ లోకి ప్రవేశిస్తున్న ట్రైన్ ముందుకి ఏమాత్రం జ్ఞానం లేకుండా, అకస్మాత్తుగా ఒక వ్యక్తిని తోసేయడం అనేది సబ్ వే ప్రయాణికులకి భాయనక పీడకలలు తెప్పించే చర్య” అని ఆయన అభివర్ణించాడు.
sunando senగత 20 సంవత్సరాలుగా అమెరికాలో నివసిస్తున్న సునందో అమెరికన్ కలల వెంట పరుగెత్తిన భారతీయుల్లో ఒకరు. వారానికి ఏడు రోజులపాటు శ్రమిస్తాడని అతని రూమ్‌మేట్లచేత అభివర్ణించబడిన సునందో వృత్తిరీత్యా గ్రాఫిక్ డిజైనర్. “న్యూ ఆమ్‌స్టర్‌డామ్ ప్రింటింగ్ కంపెనీ” లో పనిచేసిన సునందో ఆరు నెలల క్రితమే అత్యంత ఖరీదైన లొకాలిటీ అయిన మనహట్టన్‌లో తన సొంత షాపు పెట్టుకున్నాడు. “తనకు తానే బాస్ కావాలన్నది అతని కల. సొంత వ్యాపారం మొదలుపెట్టాక ఎంతో ఉత్సాహభరితుడయ్యాడు” అని అతని మిత్రుడు సుమన్ తెలిపాడని న్యూయార్క్ డెయిలీ తెలిపింది. “ఎంత సున్నితుడు, మంచి వ్యక్తి అంటే అతను లేడంటే భరించలేకపోతున్నాను” అని మరో రూమ్‌మేట్ ఎం.డి.ఖాన్ తెలిపాడు. కలకత్తాలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుని న్యూయార్క్ యూనివర్సిటిలో కోర్సు చేసాక న్యూ ఆమ్‌స్టర్‌డాం ప్రింటింగ్ ప్రెస్‌లో అహరహం శ్రమించి సొంతషాపు కలను నెరవేర్చుకున్న సునందో సేన్ ఆరునెలల్లోనే మతిలేని జాతివిద్వేషానికి ఆహుతయ్యాడు.
సెప్టెంబర్ 11, 2001 నాటి దుర్ఘటన అమెరికాలో సృష్టించిన విద్వేషపూరిత వాతావరణం ఇప్పటికీ కొనసాగుతున్నదని న్యూయార్క్ సబ్ స్టేషన్ దుర్ఘటన తెలియజేస్తున్నది. ఆనాటి దుర్ఘటనకి కారకులుగా ఆల్-ఖైదా, లాడెన్‌లపై నిందమోపిన అమెరికా, టెర్రరిజంపై ప్రపంచయుద్ధం ప్రకటించి మూడు దేశాలపై (ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, లిబియా) అమానవీయ యుద్ధం కావించి కోట్లాది ప్రజల జీవితాల్లో నిప్పులు పోసి వారిని నిలువనీడ లేకుండా చేసింది. ఇపుడు నాలుగో దేశం సిరియాలో కిరాయి తిరుగుబాటు నడిపిస్తూ ఆదేశాన్ని మూడు ముక్కలు చేయడానికి యూరప్, ఇజ్రాయెల్‌లతో కలిసి నీచమైన కుట్రలు సాగిస్తోంది. ఆల్-ఖైదాపై ప్రపంచయుద్ధం ప్రకటించిన అమెరికా అదే ఆల్-ఖైదాతో కలిసి లిబియాలో ప్రభుత్వం ఏర్పరచడమే కాక సిరియాలోనూ ఆల్-ఖైదాతో అంటకాగుతూ దానికి అత్యాధునిక మిసైళ్ళు సరఫరా చేస్తూ సిరియా ప్రజలను రక్తపుటేరుల్లో ముంచెత్తుతోంది.
సెప్టెంబర్ 11, 2001 దుర్ఘటనకు కారణం అమెరికా ప్రభుత్వంలోని మితవాద శక్తులేననీ, ఈ ‘ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్’ ద్వారా ముస్లిం దేశాలపై అమెరికన్ ప్రజల్లో విద్వేషాన్ని రగిల్చి తద్వారా ముస్లిమ్, అరబ్ దేశాల్లోని ఆయిల్ వనరులను కబళించడానికే తమప్రజలపై తామే అమానుష టెర్రరిస్టు చర్యకు పూనుకున్నారని అనేకమంది పరిశోధకులు ఇప్పటికే తేల్చిచెప్పారు. ప్రపంచం నలుమూలలా చీమ చిటుక్కుమన్నా తనకు తెలిసేలా అత్యంత అధునాతన వేగు వ్యవస్ధలను ఏర్పరుచుకున్న అమెరికా రాజ్య వ్యవస్ధ కొన్ని గంటలపాటు అమెరికా ప్రధాన నగరాలపై హైజాక్ చేయబడిన విమానాలు వీరవిహారం చేస్తున్నా అమెరికన్ రాడార్లు ఎందుకు కనిపెట్టలేదని సదరు పరిశోధకులు ప్రశ్నించారు. దుర్ఘటన జరిగినపుడు ఒక స్కూల్‌లో ఉన్న జార్జి బుష్ దుర్ఘటన సమాచారం వెనువెంటనే తనకి చేరినా అరగంటపాటు నిమ్మకు నీరెత్తినట్లు స్కూల్‌లోనే ఎందుకు ఉండిపోయాడని వారు ప్రశ్నించారు.
విమానం ఢీకొన్నంతమాత్రానే వందకు పైగా అంతస్ధులు గల భవనాలు పునాదుల వరకూ నిలువునా కూలిపోయేంత బలహీనంగా నిర్మించబడ్డాయా అని వారు ప్రశ్నించారు. ఎంతపెద్ద విమానం ఢీకొన్నా అత్యంత కట్టుదిట్టంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన డబ్ల్యూ.టి.సి జంట టవర్లు పునాదులవరకూ కూలిపోవడం అసంభవం అని డిమాలిషన్ టెక్నాలజిస్టులు కూడా తేల్చిచెప్పిన సత్యం. ఒక పధకం ప్రకారం డిమాలిషన్ టెక్నాలజీతో, బాంబులతో నియంత్రిత కూల్చివేత (controlled demolition) జరిగితే తప్ప అటువంటి కూల్చివేతలు జరగడం సాధ్యం కాదని సదరు టెక్నాలజిస్టులు విప్పిచెప్పిన సత్యం. ఈ వాస్తవాలన్నీ విచారణలో తేలినప్పటికీ విచారణ నివేదిక అమెరికన్ ప్రజలకు చేరకుండా కాంగ్రెస్, సెనేట్ లు తొక్కిపెట్టాయని అనేకమంది పరిశోధకులు, విలేఖరులు, రాజకీయ నాయకులు ఆరోపణలు చేసినప్పటికీ వాటిని వెలుగులోకి రాకుండా పశ్చిమ కార్పొరేట్ (విష)పత్రికలు తొక్కిపెట్టాయన్నది దాచేస్తే దాగని సత్యం.
అసలు నిజం ఇది కాగా అనేకమంది అమెరికన్ ప్రజలు కార్పొరేట్ పత్రికల విషప్రచారాన్ని నమ్ముతూ ఇంకా బధిరాంధకారంలోనే మగ్గడం అత్యంత విచారకరం. అమెరికన్ సామ్రాజ్యవాద రాజ్యవ్యవస్ధ ప్రపంచ దేశాలపై అచ్చోసిన ఆంబోతులా తెగబడి కోట్లాది ప్రజలను అంతం కావిస్తూ, మరిన్ని కోట్లమంది బ్రతుకులను ఛిద్రం కావిస్తున్నప్పటికీ స్పందించలేని అమెరికా ప్రజలు ఏ నాగరికతకు ప్రతినిధులో ఆత్మవిమర్శ చేసుకోవాలి. సవాలక్ష అబద్ధాలతో ఒక స్వతంత్ర దేశంపై అమెరికన్ రాజులు దాడి చేసినతోడనే వారి పాపులారిటీ రేటింగ్ అమాంతం పెరుగుతోందంటే రాక్షసత్వాన్ని ఆరాధించే సంస్కృతి మధ్యయుగాల అనాగరిక విద్వేష సంస్కృతా లేక నాగరికతా శిఖరాలపై అధిష్టించిన సర్వమానవ సమానతా సంస్కృతా అన్నది అమెరికన్ ప్రజలు ఆలోచించుకోవాలి. పరదేశాలనూ, ప్రజలనూ, వారి జీవితాలనూ కబళించి చీకటిలో ముంచే అమెరికన్ సామ్రాజ్యవాదుల యుద్ధోన్మాదాన్ని తిరస్కరించే స్ధాయికి అమెరికన్ ప్రజలు చేరుకోకపోతే ప్రపంచానికి పట్టిన అమెరికా శని కొనసాగడంలో వారికీ భాగస్వామ్యం ఉన్నట్లే.

Friday, October 19, 2012

గుడ్డు మంచి పౌష్టికాహారం.

ఇంటర్నేషనల్‌ ఎగ్‌ కమిషన్‌ 1996లో ‘వరల్డ్‌ ఎగ్‌ డే’ని ప్రకటించినది. కొ న్ని దేశాలలో ఎగ్‌ ఫెస్టివల్‌ను జరుపుతారు. ఇంటర్నేషనల్‌ ఎగ్‌ కమిషన్‌ ప్రపంచంలో గల ప్రజల మధ్య అనుసంధానాన్ని ఏర్పరిచే... ప్ర పంచ గుడ్ల పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే ఏకైక సంస్థ. విభిన్న సంస్కృతులు, జాతీయత ల నడుమ సంబంధాలు అభివృద్ధిపరిచే సమా చారం తెలియజెప్పే అసాధారణ కమ్యూనిటీ ‘ఇంటర్నేషనల్‌ ఎగ్‌ కమిషన్‌’. ఐ.ఇ.సి గుడ్ల ఉత్పత్తి పోషకాలు, మార్కెటింగ్‌లకు సంబం ధించిన తజా పరిణామాల్ని పర్యవేక్షిస్తుంటుం ది. 1996లో వియన్నాలో జరిగిన ఇంటర్నేష నల్‌ ఎగ్‌ కమిషన్‌ సదస్సులో అక్టోబర్‌ రెండో శుక్రవారం నాడు ‘వరల్డ్‌ ఎగ్‌ డే’ నిర్వహిం చాలని ప్రకటించారు.

మనదేశంలో...
మన దేశంలో గుడ్డు వాడకం అధికమనే చె ప్పాలి.‚‚‚‚ గుడ్డును పలు రూపాలలో ఆహారంగా తీసుకుంటారు. పచ్చి గుడ్డుసొనను నోటిలో పోసుకొని మింగడం, గుడ్డును ఉడికించి తిన డం, ఉడికించిన గుడ్డు బ్రెడ్‌ ని కలిపి టోస్ట్‌గా కూడా తీసుకుంటారు. అంతేకాకుండా గుడ్డు ను పలావులో, బిర్యానిలో రుచికోసం వాడతా రు, బేకరీలలో కేకుల తయారీల్లో గుడ్డును విరివిగా వాడుతారు. గుడ్డు ఆమ్లెట్‌, బుల్స్‌ ఐ,ఎగ్‌ ఫ్రై... కూరగా వాడుతారు. గుడ్డు ఏ ఒక్క వయసువారికో పరిమితమైన ఆహారం కాదు. బాల్యం నుండి వృద్దాప్యం వరకు అన్ని వయసులలో స్ర్తీ పురుషులు భేదం లేకుండా గుడ్డును తీసుకుంటారు. గుడ్డుమీద జరుగుతున్న పరిశోధనలు ఏటా కొత్త ఫలితాలను ఇస్తూనేవున్నాయి. గుడ్డును తీసుకోవాల్సిన అవసరాన్ని పదే పదే నొక్కిచె బుతున్నారు. ఉదయం అల్పాహారంతో గుడ్డు తీసుకోవడం మంచిదని తజా అధ్యయనము లో తేలినది. గుడ్డులో సొన శక్తినిస్తుంది. శరీ రంలో ప్రతి అవయవం మీద గుడ్డు ప్రభావం చూపుతుంది. గుడ్డును శాకాహారంగా ప్రకటించి అందరికీ గుడ్డు అందించాలనే ఉద్యమం ఇటీవలి కాలంలో ఊపందుకుంది.

గుడ్డు ద్వారా మనకందే పోషకాలు...
World-Egg-Day
క్యాలరీలు	: 70-80
ప్రోటీన్లు	: 6 గ్రాములు
క్రొవ్వులు	: 5 గ్రాములు
కొలెస్టిరాల్‌	: 190 గ్రాములు
నీరు	: 87%


కోడిగుడ్డుతో ఉపయోగాలు...
మంచి చేసేవి:

* గుడ్డు పౌష్టికాహారం. శరీరానికి కావల్సిన పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. పిల్లల పెరు గుదలకు మంచిది. కూరగా వాడుకోవచ్చు.
* కోడి గుడ్డు తింటే దృష్టికి ఎంతో మేలు కలుగుతుంది. రోజు గుడ్డు తినేవారికి శుక్లాలు వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది.
* గుడ్డు తక్కువ క్యాలరీలు శక్తిని ఇస్తుంది సాధారణ సైజు గుడ్డు 80 క్యాలరీలు శక్తిని అందిస్తుంది కాబట్టి డైటింగ్‌లో ఉన్నవారు కూడా గుడ్డును తీసుకోవచ్చు.

* బరువు తగ్గేందుకు గుడ్డు పనికొస్తుంది. అందులో ఉన్న నాణ్యమైన ప్రోటీన్ల వల్ల గుడ్డు తీసుకోగానే కడుపు నిండినట్టుగా అవుతుంది. ఎక్కువ ఆహారం తీసుకోనివ్వదు... అందువల్ల పరిమిత ఆహారం తీసుకొని బరువును నియంత్రించుకోగలుగుతారు.
* గుడ్డు తినటం వల్ల గుండె జబ్బులు పెరుగుతాయన్నది అపోహ మాత్రమేనని ఒక అధ్యయనం వల్ల వెల్లడయ్యింది. వాస్తవంగా గుడ్డు తినేవారిలో రక్తనాళాలు మూసుకుపో వటం లేదా గుడెజబ్బులు రావటం బాగా తక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు.

* మెడడుకు ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలు గుడ్డులో ఉన్నాయి. గుడ్డుసొనలో 300 మైక్రోగ్రాములు కోలిన్‌ అనే పోషక పదార్థం ఉంది. ఇది మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెదడులో సమాచార రవాణాన్ని మెరుగుపరుస్తుంది, మెదడు నుండి సంకేతాలు వేగంగా చేరవేయడంలో కూడా కోలిన్‌ ప్రాత్ర వహిస్తుసంది.
* గుడ్డులో ఉన్న ఐరన్‌ శరీరం చాలా సులభంగా గ్రహిస్తుంది. అలా గ్రహించే రూపంలో ఐరన్‌ ఉన్నందున గుడ్డు గర్భిణీ స్ర్తీలకు, బాలింతలకు ఎంతో మేలు చేస్తుంది.
* గుడ్డును ఆహారంగా తీసుకోవటానికి, కొలెస్టరాల్‌కి ఎటువంటి సంబంధం లేదు. ప్ర తి రోజూ రెండు కోడి గుడ్లు తీసుకునే వారికి లైపిడ్సులో ఎటువంటి మార్పు లేకపోవడం గమనించారు. పైగా గుడ్డు వలన శరీరానికి మేలు చేసే కొలెస్టరాల్‌ పెరుగుతుందని తేలింది.

omelet-1egg* స్ర్తీలలో రొమ్ము క్యాన్సర్‌ రాకుండా కాపాడే శక్తి గుడ్డుకి ఉందని పరిశోధనల్లో తేలింది. ఒక అధ్యయనంలో... వారంలో 6 రోజులు గుడ్డు ఆహారంగా స్ర్తీలకు ఇచ్చారు... అప్పుడు వారిలో రొమ్ము క్యాన్సర్‌ బారిన పడే అవకాశం 44 శాతం తగ్గినట్లు తేలినది.
* గుడ్డు వలన శిరోజాల ఆరోగ్యం మెరు గవుతుంది. గుడ్డులో ఉన్న సల్ఫర్‌, పలురకాల విటమిన్లు, లవణాల వల్ల శిరోజాలకు మంచి పోషణ లభిస్తుంది. మనుషుల గోళ్ళకు మంచి ఆరోగ్యాన్ని గుడ్డు అందిస్తుంది.

* గుడ్డులో పలురకాల లవణాలు, అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌లు ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి మేలుచేసేవే.
* గుడ్డులోని ప్రోటీన్ల వల్ల యవ్వనంలో కండరాలకు బలం, చక్కని రూపం ఏర్పడుతుంది.
జాగ్రత్తలు పాటిస్తే ఆ కొద్ది నష్టాలూ ఉండవు...
* గుడ్డును బాగా ఉడికించి అందులోని బాక్టీరియాను పూర్తిగా సంహరించబడేలా చూసుకోవాలి. బాక్టీరియా వల్ల శరీరానికి నస్టం జరుగుతుంది.

* పచ్చి గుడ్దు తినడం మంచిదికాదు. తెల్లసొనలో ఎవిడిన్‌ అనే గ్లైకో పోటీన్‌ ఉన్నందున అది బి-విటమిన్‌ను శరీరానికి అందనీయకుండా చేస్తుంది.
* కొలెస్టరాల్‌ జబ్బులతో బాధపడుతున్నవారు గుడ్డును తీసుకొరాదు.
* టైప్‌ 2 డయాబిటీస్‌ ఉన్నవారు గుడ్డును వాడరాదు. రిస్క్‌ను ఎక్కువ చేస్తుందని రిపోర్టులున్నాయి.
* కొంతమందిలో ఫుడ్‌ ఎలర్జీ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు ఉన్నాయి. కావున ఫుడ్‌ ఎలర్జీ ఉన్నవారు గుడ్డు తీసుకోరాదు.
* కొన్ని యాంటిబయోటిక్స్‌ మందులు ఉ దా సెఫలొస్పోరిన్స్‌ వాడేవారిలో గుడ్డు పని చేయక పోవచ్చు. ఇది యాంటిబయోటిక్‌ రెసిస్టెంట్‌.

గుండె ఆరోగ్యానికి గుడ్డు...
308159సాధారణంగా ఒక వ్యక్తి జీవితంలో ఏ అనా రోగ్యం లేనప్పుడు ఏం తిన్నా బయమనిపించదు. అదే వయసు పెరుగుంటే? ఆరోగ్య సమ స్యలు ఒక్కొక్కటిగా మొదలవుతోంటే? ము ఖ్యంగా నాలుగు పదులు సమీపిస్తుంటే గుండె గుబగుబలాడుతుంది. ఏం తింటే ఏం ఇబ్బం దో అని లెక్కలేన్ని సందేహాలు, బోలెడు అను మానాలు ఎదురవుతాయి. అలాంటి సందేహా లు తొలగించే గుండె ఆరోగ్యాన్ని పదిల పరిచే గుడ్డు గురించి తెలుసుకుందాం...

ప్రతి రోజూ గుడ్డు తినడం వల్ల గుండెజబ్బు వస్తుందని వేడిచేస్తుందనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ ఈ అభిప్రాయంలో వాస్త వం లేదు. వారంలో వారం రోజులు గుడ్డు తిన్నా కూడా దాని కారణంగా ఎటువంటి గుండెజబ్బులూ రావడానికి ఆస్కారం లేదని వైద్య నిపుణులు అంటున్నారు. నిజానికి కొలె స్టరాల్‌ కారణంగా గుండె జబ్బులు తలెత్తుతా యి కానీ, కాలేయం కొలెస్టరాల్‌ని ఉత్పత్తి చేయాలంటే ఆహారంలో హానికారక శాచురే టెడ్‌, ట్రాన్స్‌ప్యాట్లు ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. నిజానికి గుడ్డు అనేక పోషకాల మిళితం. ఇందులో శరీరా నికి అవసరమయ్యే అన్నీ కీలకమై విటమి న్లు, ఖనిజాలు, 
మేలు చేసే అన్‌ శాచురేటెడ్‌ కొవ్వులు, మాంసకృత్తులు లభిస్తాయి.

బరువునూ తగ్గిస్తుంది..!
ఎన్నో సంవత్సరాలనుండి గుడ్డు కొలెస్టరాల్‌ ఇస్తుందని అది మీ రక్తనాళాలను అడ్డగిస్తుం దని వింటూ వున్నాం. అయితే, అది మీ బరు వు ఎలా తగ్గిస్తుందనేది పరిశీలిచండి. జాగ్రత్త గా గమనిస్తే మీ పోషకాహార నిపుణుడు బరు వు తగ్గాలనే ప్రణాళికలో గుడ్డు తప్పక చేర్చి వుంటాడు.

* ఎదిగే వయసులో వున్నారా? ఎదిగే పిల్ల లకు గుడ్డు ఆహారంగా ఎంతో మంచిది. మ నం సాధారణంగా 25 సంవత్సరాల వయసు వరకు ఎదుగుతామని రీసెర్చి చెపుతోంది. క నుక మీరు చిన్నవారైతే గుడ్డు మంచిదే. అయి తే, మీరు నలభై ఏళ్ళ వయసు దాటిన వారైతే ఇక గుడ్డు ఆహారం నియంత్రించాల్సిందే.
* అవసరమైన ఎమినో యాసిడ్లు - ఎమినో యాసిడ్లనేవి ప్రొటీన్లకు ప్రధానం. గుడ్డులో వుండే ల్యూసిన్‌ అనేది ఒక ఎమినో యాసిడ్‌. ల్యూసిన్‌ బరువును తగ్గించటంలో సహకరిస్తుంది.
* తెల్లగుడ్డు - మీరు ప్రొటీన్‌ డైట్‌లో వుంటే, తెల్లగుడ్డు మీకు ప్రధానంగా కావలసిందే. వీ టిలో వుండే కేలరీలు మీ బరువు పెంచవు. బలాన్నిస్తాయి. కనుక మీ వర్కవుట్లకు సహ రిస్తాయి. కనుక బరువు త్వరగా తగ్గాలంటే, సన్నబడాలంటే, గుడ్డు వాడాల్సిందే.

* గుడ్డులో పచ్చసొన - గుడ్డులో పచ్చ సొన చాలా రుచికర భాగం. అందులో చాలా విటమిన్లు వుంటాయి. కనుక పచ్చ సొన బాగా తినండి. అయితే 1 లేదా 2 గుడ్లకు లిమిట్‌ చేయండి.
గుడ్డు ఎలా తినాలి?
బాగా వేయించిన ఆమ్లెట్‌ అయి తే... మీ బరువు తగ్గటంలో సహకరించదు. గుడ్డు కాలితే కేలరీలు అధికమై, కొల్లెస్టరాల్‌ పెరుగుతుంది. వాటిని మెత్తగా ఉడికించి తింటే చాలు, అందులో వున్న పోషకాలన్నీ మీకు గరిష్టంగా చేరి ఆరోగ్యంగా బరువు తగ్గిస్తాయి. 

Monday, September 24, 2012

బాలికపై 12 మంది అత్యాచారం: ప్రేమ పేరుతో మోసం


 Minor Girl Assaulted Hisar
చండీగఢ్: ప్రేమ పేరుతో మోసం చేసి పదహారేళ్ల అమ్మాయిపై 12 మంది అత్యాచారం చేసిన దుర్ఘటన చండీగఢ్‌లో జరిగింది. అమ్మాయిని ప్రేమించిన వ్యక్తే ఆమెపై మరో 11 మందితో కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన జరిగిన పది రోజుల తర్వాత.. బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పగా, ఆ మరుసటి రోజే తండ్రి గుండె పగిలి మరణించాడు. హర్యానాలోని హిసార్ ప్రాంతం దబ్రా కుగ్రామంలోజరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.
దీనిపై ఆమె సామాజిక వర్గం ఆందోళనబాట పట్టగా.. ప్రేమికుడిగా భావిస్తున్న మహేందర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. బాధితురాలి కథనం ప్రకారం.. ఈ నెల తొమ్మిదో తేదీన ఊరికి దగ్గర్లోని పటేల్‌నగర్‌కు ఆమె బయలుదేరింది. దారిలో మహేందర్ కలిశాడు. మాటల్లోపెట్టి పక్కనే ఉన్న తోపులోకి తీసుకెళ్లాడు. ఆ మాటా ఈ మాటా మాట్లాడిన అనంతరం సమీపానే ఉన్న తన స్నేహితులకు సైగ చేశాడు. ఒక్కసారిగా 12 మంది వారిద్దరిని చుట్టుముట్టారు.
అందరూ కలిసి ఆమె నోరు మూసేశారు. ఆమె తేరుకునేలోపలే బలవంతంగా సమీపంలోని చెరుకు తోటలోకి తీసుకెళ్లారు. కొందరు కాపలా నిలబడగా.. మిగతావారంతా అత్యాచారానికి పాల్పడ్డారు. అరిచి గోల చేయకుండా పెద్దమొత్తంలో నిద్రమాత్రలు మింగించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పటేల్‌నగర్‌లోని బంధువు ఇంటికి దగ్గర్లో పడేసిపోయారు. పది రోజుల తరువాత.. ఈ నెల 19వ తేదీన ధైర్యం తెచ్చుకొని ఆమె ఈ విషయం ఇంట్లో చెప్పింది.
అది విన్న ఆమె తండ్రి కృష్ణ తట్టుకోలేకపోయాడు. మరుసటి రోజే గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటనపై గ్రామంలోని దళిత కుటుంబాలు ఉద్యమబాట పడ్డాయి. మహేందర్ సహా 12 మందిని అరెస్టు చేసేదాకా కృష్ణ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తీసుకెళ్లేది లేదని భీష్మించాయి. కాగా, మహేందర్ బృందంలోని వాడిగా భావిస్తున్న శీతూను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. నిజానికి.. అప్పటిదాకా తొమ్మిది మందే ఉన్నట్టు భావించిన పోలీసులు, శీతూ వాంగ్మూలంతో అవాక్కయ్యారు.

Saturday, September 22, 2012

మన శరీరం ఒక యంత్రం లాంటిది. ఇంధనం లేకపోతే యంత్రం ఎలా పని చేయలేదో అలా మన శరీరం కూడ ఆహారం లేకపోతే


fod
శరీరం-పోషకాహారం
మన శరీరం ఒక యంత్రం లాంటిది. ఇంధనం లేకపోతే యంత్రం ఎలా పని చేయలేదో అలా మన శరీరం కూడ ఆహారం లేకపోతే పని చేయదు. మనం తీసుకొనే ఆహారం శరీరం సక్రమంగా పని చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తూ ‘ఇంధనం’ లా పని చేస్తుంది.


ఆహారం మన శరీరానికి ఈ క్రింది మూడు విధాలుగా ఉపయోగపడుతుంది.
1. శరీర నిర్మాణానికి:
మనం తీసుకున్న ఆహారం శరీర నిర్మాణానికి దోహద పడుతుంది. 2.7 కిలోల నుంచి 3.2 కిలోల మధ్య బరువుండే కొత్తగా పుట్టిన పాపాయి పెరిగి పెద్దయే సరికి 55 నుంచి 70 కిలోల బరువుకు చేరుకుంటాడు. అంటే ఈ ఎదిగిన బరువంత కూడా అతనికి తను పుట్టిన దగ్గరి నుంచి నిత్యం తీసుకొంటున్న ఆహారం ద్వారానే లభించుతుంది. దీనిని బట్టి తేలేది ఏమిటంటే ఆహారం యొక్క అతి ముఖ్యమైన ఫంక్షన్‌ శరీర నిర్మాణానికి సహకరించటం! పుట్టిన దగ్గరనుంచి పెరిగి పెద్దయేదాకా -అంటే అడల్ట్‌హుడ్‌ దాకా మీరు ప్రతిరోజు ఆహారాన్ని సరెైన పరిమాణంలో తీసుకుంటే అది మీ శరీరంలో అరిగిపోయిన కణజాలం స్థానంలో కొత్త కణాల్ని నిర్మించుతూ, మీ శరీరం సక్రమమైన రీతిలో ఎదుగుతూ ఆరోగ్యంతో విలసిల్లుతూ పరిపూర్ణస్థాయికి చేరుకొనేటట్లు చేస్తుంది.

2. శక్తిని చేకూర్చటానికి:
ఆహారం మన శరీరానికి అందజేసే రెండవ ఉపకరణం ఏమిటంటే - మన శరీరం చేసే సంకల్పిత, అసంకల్పిత చర్యలకు అవసరమైన శక్తిని అందించటం. సంకల్పిత చర్యలు అంటే ఇంటిపని నుంచి ఆఫీసు పని దాకా నిత్య జీవితంలో మనం తెలిసి చేస్తుండే - ప్రయత్నపూర్వకంగా చేసే పనులు.
అసంకల్పిత చర్యలు: అంటే మన ప్రయత్నం మన ప్రమేయం లేకుండా మన శరీరంలో యాంత్రికంగా జరిగిపోయే చర్యలు! ఉదాహరణకు గుండె కొట్టుకో వడం, జీర్ణం కావడం, శరీరంలో టెంపరేచరు క్రమబద్దీకరించబడటం మొదలెైనవి.

3.శరీర కార్యక్రమాన్ని క్రమబద్దీకరించటం:
మన శరీరంలో యాంత్రికంగా జరిగిపోయే, జరగాల్సిన, కార్యక్రమాల క్రమబద్ధీకరణ ఈ కోవలోకి వచ్చే చర్యలు:
గుండె కొట్టుకోవటం
కండరాల సంకోచవ్యాకోచాలు
నీటి సమతుల్యాన్ని కాపాడటం
రక్తం గడ్డ కట్టటం
శరీరం నుంచి వ్యర్థపదార్థాల్ని తొలగించటం మొదలెైనవి.
శరీరం సక్రమంగా ఆరోగ్యంతో ఉండాలన్నా, శరీరానికి అవసరమైన శక్తి సరిప డా లభించాలన్నా మనం అన్ని పోషక విలువలు కలిగిన సమతుల్యాహారాన్ని రెగ్యులర్‌గా తీసుకొంటూ ఉండాలి.
మన మనుగడకు అవసరమైన ఆహారం ద్వారా మనకు లభించే పోషక విలువలు:
కార్బోహైడ్రేట్స్‌
మాంసకృత్తులు
కొవ్వు పదార్థాలు
విటమిన్‌లు
ఖనిజ లవణాలు
నీరు
పీచు పదార్థం
సమతులాహారం

మీరు నోట్లో ఆహారాన్ని పెట్టుకున్నప్పుడల్లా ‘మానవ శరీరం’ అనబడే అత్యంత తెలివెైన రసాయన యంత్రాంగానికి మీరు రీ-ఫ్యూయల్‌ చేస్తున్నారన్నమాట! మన శరీరం పని చేయటానికి ఆహారం, నీరు - ఈ రెండూ అతి ముఖ్యమైన పోషకావసరాలు.మన శరీరంలోకి ప్రవేశించే ప్రమాదకరమైన బాక్టీరియాలతో పోరాటం సల్పటానికి, శరీరానికి అవసరమైన నీటి సమతుల్యతను కాపాడటానికి, ఇతరత్రా మరెన్నో శరీర ధర్మ నిర్వహణల కోసం ఆహారం ద్వారా లభించే అనేక రసాయనాలు శరీరానికెంతగానో అవసరమవుతాయి.

కొన్ని ఆహార పదార్థాలలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. కొన్నింటిలో తక్కువ పోషక విలువలు ఉంటాయి. అలాగని ఏ ఆహారాన్ని తీసి పారేయటానికి వీలులేదు. మనం ఎంత తింటు న్నామన్నది మాత్రమే కాదు. ఏమి తింటున్నామన్నది కూడా ముఖ్యమైన అంశమే.కొన్ని కొన్ని ఆహార పదార్థాలు కొన్ని కొన్ని వ్యాధుల్ని నిరోధించగలవు. నియంత్రించగలవు. ఇందుకు 
ఉదాహరణ: పండ్లు, కూరగాయలు క్యాన్సర్‌ వ్యాధిని నిరోధించగలవు. ఆహార పదార్థాలలోని పీచు (ఫెైబర్‌) కొలెస్టరాల్‌ నియంత్రణకు సాయపడుతుంది. వృద్ధాప్యంలో వచ్చే ‘అస్టియోపొరాసిస్‌’ వ్యాధిని నిరోధించటానికి కాల్షియం అధికంగా లభ్యమయ్యే పాలులాంటి వాటిని తీసుకోవాలి. ‘ఆస్టియోపొరా సిస్‌’ కారణంగా ఎముకలు బోలుబారి తేలికగా విరుగుతాయి.

ఈ రకంగా...
శరీరారోగ్యానికి అవసరమైన ఇలాంటి అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకుం టూ, ప్రాధాన్యతనిస్తూ, మనం సక్రమమైన ఆరోగ్యంలో ఉండటానికి ఏ ఏ ఆహార పదార్థాలను ఏఏ మేర తీసుకోవాలన్న విషయమై అమెరికా శాస్త్రజ్ఞులు ‘ఫుడ్‌ గెైడ్‌ పిరమిడ్‌’ అన్న పేరుతో ఆహార నియమావళిని రూపొందించారు.

‘ఫుడ్‌ గెైడ్‌ పిరమిడ్‌’
ప్రకారం మనం: అన్నం, రొట్టె, బ్రెడ్‌ వగెైరాలు: వీటిని ఎక్కువగా వాడుకోవాలి. ఈ ఆహార పదార్థాలలో ఫెైబర్‌, ‘బి’ విటమిన్‌లు, ఖనిజలవణాలు పుష్కలంగా ఉండటమే కాకుండా కాంప్లెక్స్‌ కార్బొహైడ్రేట్స్‌ కూడా లభిస్తాయి.
పళ్ళు:వీటిలో కొవ్వు, ఉప్పు తక్కువగా ఉంటాయి. విటమిన్‌లు ‘ఎ’,‘సి’ లాంటివి అధికంగా లభిస్తాయి. పొటాషియం, మరికొన్ని ఖనిజ లవణాలు కూడా లభించటమే కాక ఫెైబర్‌ అధికంగా లభిస్తుంది. వీలెైనప్పుడల్లా తాజా పళ్ళను తినటం మేలు.
కాయగూరలు: వీటిలో కూడా కొవ్వు తక్కువగానూ, ‘ఎ’, ‘సి’ విటమిన్‌లు ఎక్కువగానూ లభిస్తాయి. ఫెైబర్‌, ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. మాంసం, చేపలు, చికెన్‌, గుడ్లు, జీడిపప్పు, వగెైరాలు: వీటిలో సాధారణంగా ప్రొటీన్లు ఎక్కువ ఉంటాయి. ఐరన్‌, ‘బి’ విటమిన్‌, మరికొన్ని ఖనిజ లవణాలు కూడా బాగానే ఉంటాయి. కొవ్వు కూడా అధికంగానే ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి.
పాలు,పెరుగు,వెన్న: డెైరీ ఉత్పత్తులలో కాల్షియం, ప్రొటీన్‌లు, విటమిన్‌లు, కొన్ని ఖనిజ లవణాలు ఎక్కువగా లభిస్తాయి. కొవ్వు కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి తక్కువగా వాడటం మంచిది.
స్వీట్లు,నూనెలు:ఈ ఆహారపదార్థాలలో పోషకవిలువలు అంతగా ఉండవు కాని కేలరీలు (శక్తి) మాత్రం సమృద్ధిగా లభిస్తాయి. కేకులు, స్వీట్లులాంటి వాటిని ఎంత తక్కువగా తింటే అంత మంచిది.
ఆహారాన్ని అసలు తీసుకోకపోతే...కొందరు చానాళ్ళపాటు ఏ ఆహారం తీసుకోకుండా ఉండాల్సి వస్తుంది. నిరాహారదీక్ష వల్ల, అనోరెగ్జియా నెర్వోసా వల్ల, జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఏ భాగానన్నా తీవ్రమైన వ్యాధితో బాధ పడుతున్నప్పుడు, పక్షవాతం వల్ల, కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు...
ఇలాంటి సందర్భాలలో మనుషూలు ఆహారాన్ని తీసుకోకుండా నిరాహారా నికి గురి కావల్సి వస్తుంది.

ఎన్నాళ్ళకూ ఆహారాన్ని తీసుకోని ఇలాంటి సందర్భాలలో శరీరం శక్తికోసం తనలోని కణజాలాన్నే కేలరీల కింద హరాయించుకోవటం మొదలెడు తుంది. ఫలితంగా శరీరంలో నిలవ ఉంచుకున్న కొవ్వు దాదాపు అదృశ్యమై పోతుంది. అంతర్గతావయవాలు, కండరాలు,క్రమేపీ డామేజ్‌ కావటం మొదలెడతాయి.నిరాహారానికి గురెైన సందర్భంలో పెద్దవాళ్ళు తమ శరీరానికి చెందిన బరువులో సగానికి పెైగా కోల్పోయే ప్రమాదం ఉంది. పిల్లలు ఇంకా ఎక్కువ బరువును కోల్పోతారు.
శరీరపు బరువును కోల్పోతున్న నిష్పత్తిలోనే లివరు, పేగులు అధికంగా కృశించుతాయి. కిడ్నీలు, గుండె కాస్త తక్కువ స్థాయిలో కృశించుతాయి. 

ఇంకా జరిగే మార్పులు ఏమిటంటే:
కండరాలు కరిగిపోయే ఎముకలు పొడుచుకు వస్తాయి.
చర్మం పల్చగా అయి పొడిబారిపోతుంది. చర్మంలో సాగేగుణం తగ్గిపోతుం ది. తెల్లగా పాలిపోతుంది .చల్లగా అవుతుంది.
వెంట్రుకలు పొడిబారి చిట్లుతుంటాయి. తేలికగా రాలిపోతుంటాయి.
పూర్తిగా నిరాహారంగా ఉంటే ఆ మనిషి 8 నుంచి 12 వారాల లోపు చనిపోతాడు.

ట్రీట్‌మెంట్‌
ఎక్కువ రోజుల పాటు నిరాహారంగా ఉన్న మనిషిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావటానికి కొంత వ్యవధి పడుతుంది. ఎంతకాలం పడుతుందనేది అతను ఎన్నాళ్ళనుంచి నిరాహారంగా ఉన్నాడు, దాని ప్రభావం అతని శరీరం మీద ఎంతగా పడింది అన్న వాటిమీద ఆధారపడి ఉంటుంది.అధిక రోజులపాటు నిరాహారంగా ఉండటం వల్ల జీర్ణయంత్రాంగా ముడుచుకు పోతుంది. మామూలు సమయాలలో తీసుకునేంత ఆహారాన్ని అది ఇముడ్చుకోలేదు.

మనం తీసుకున్న ఆహారం శరీర నిర్మాణానికి దోహదపడుతుంది. 2.7 కిలోల నుంచి 3.2 కిలోల మధ్య బరువుండే కొత్తగా పుట్టిన పాపాయి పెరిగి పెద్దయే సరికి 55 నుంచి 70 కిలోల బరువుకు చేరుకుంటాడు. అంటే ఈ ఎదిగిన బరువంత కూడా అతనికి తను పుట్టిన దగ్గరి నుంచి నిత్యం తీసుకొంటున్న ఆహారం ద్వారానే లభించుతుంది.

అసంకల్పిత చర్యలు: అంటే మన ప్రయత్నం మన ప్రమేయం లేకుండా మన శరీరంలో యాంత్రికంగా జరిగిపోయే చర్యలు! ఉదాహరణకు గుండె కొట్టుకో వడం, జీర్ణం కావడం, శరీరంలో టెంపరేచరు క్రమబద్దీకరించబడటం మొదలెైనవి.

గర్భిణులూ సెల్‌ మాట్టాడవద్దు.......50శాతం మందికి పెైగా రేడియేషన్‌ ప్రభావానికి


గర్భిణులూ సెల్‌ మాట్టాడవద్దు
Pregnaగర్భంతో భర్తకు దూరంగా ...పుట్టింట ఉండటం కాస్త కష్టమే. కానీ అంతా అయినవారు ఉన్నా మనసెరిగిన మారాజు చెంతనలేడన్న లోటు తీర్చుకునేందుకు పూర్వకాలంలో ఉత్తరాలు రాసుకుంటే ...ఇప్పుడు ఆ జంటల మధ్య దూరాన్ని తగ్గించే బాధ్యత సెల్‌ఫోన్లే తీసుకున్నాయని చెప్పాలి. దీంతో అదే పనిగా అవసరం ఉన్నా లేకున్నా సెల్‌ఫోన్లతో గర్భంతో ఉన్నవారు ఎక్కువగా తన భర్తతో మాట్లాడేస్తున్నారు.గర్భంతో ఉండే మహిళలు సెల్‌ ఫోన్‌తో ఎక్కువగా మాట్లాడితే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశో ధకులు. ఈ విషయమై కాలిఫోర్నియా, దక్షిణ కాలిఫోర్నియా లకు చెందిన శాస్త్రజ్ఞుల బృందం జరిపిన తాజా అధ్యయనంలో ఈ నిజం వెలుగు చూసినట్లు వెల్లడించారు. కాలిఫోర్నియాలో దాదాపు 30 వేల మంది చిన్నారులపెై వివిధ రకాల పరీక్షలు జరిపి, శోధించగా వారిలో 50శాతం మందికి పెైగా రేడియేషన్‌ ప్రభావానికి గురెైనట్లు తేలిందని తేల్చి చెప్పారు.

అందుకు కారణం ఆ బిడ్డల తల్లులు గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువగా సెల్‌ఫోన్‌ వాడటమే ప్రధానంశంగా తేల్చి చెప్పారు. పుట్టగానే ఆ రేడియేషన్‌ ప్రభావం పెైకి కనిపించదని, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినా వయసు పెరుగుతున్న కొలది అవలక్షణాలు బెైటకు వస్తున్నట్లు తాము గుర్తించినట్లు శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేసింది. తల్లి గర్భంతో ఉన్నప్పుడు రేడియేషన్‌ ప్రభావానికి గురయ్యే చిన్నారులు 30 శాతంగా నమోదు కాగా... చిన్నారుల ముద్దు మాటలకు ముచ్చటపడి సెల్‌ ఫోన్లలో మాట్లాడించడం వల్ల 20 శాతం మంది రేడియేషన్‌ ప్రభావానికి గురవుతున్నారని, దీని వల్ల ఈ చిన్నారు లు ఏడేళ్ల వయసుకు వచ్చేసరికి వారి ప్రవర్తనలో అసాధారణ మార్పులు కల్గడమే కాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదుర్కొంటున్నట్లు గమనించామని పరిశోధకులు చెబుతున్నారు.

గర్భిణులు నిరిష్టకాల పరిమితిలో అవసరానికి అనుగుణంగా మొబెైల్‌ వినియోగిస్తే తప్పుకాదని, రోజులో కావా ల్సిన వారితో మూడు, నాలుగుసార్లు సంభాషించుకో వచ్చని... అయితే అది కూడా నాలుగు నిమిషాలకు మించకుండా ఉండాలని, అంతకన్నా ఎక్కువ సేపు మాట్లాడితే పుట్టే బిడ్డపెై రేడియేషన్‌ ప్రభావం అధికంగా ఉండటం తధ్యమని హెచ్చరిస్తున్నారు. మరి పుట్టే పిల్లల భవిష్యత్‌ని తామే అంధ కారంగా మార్చకుండా...కొన్నాళెైనా సెల్‌ ఫోన్లకి దూరంగా ఉంటే మంచిదేమో? మీ సమాచారం కన్నా మీ బిడ్డ క్షేమం కూడా ముఖ్యమే కదా.

బీసీల భీష్మాచార్యుడు..బాపూజీ కన్నుమూత

kondaహైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి, సామాజిక ఉద్యమ పితామహుడు, తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ (97) శుక్రవారం ఉదయం 9.35 గంటలకు ఆకస్మి కంగా మృత్యు ఒడిలోకి జారుకున్నారు. బాపూజీ అదిలాబాద్‌ జిల్లా, వాంకిడి గ్రామంలో 1915, సెప్టెంబర్‌ 27న జన్మించారు. కొండాలక్ష్మణ్‌ తల్లి అమ్మక్క, తండ్రి బాపూజీలు. కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఇద్దరు కుమారులు సురేష్‌, ఉమేష్‌, కుమార్తె పవిత్రవాణి పటేల్‌లు ఉన్నారు. అయితే కుమారులిద్దరిలో ఒకరు దేశంకోసం మృతి చెందగా, మరొ కరు ప్రమాదవశాత్తు మృతి చెందారు. భార్య డాక్టర్‌ శకుంతల ఇటీవలనే కన్నుమూసినప్పటికీ బాపూజీ మొక్కవోని ధెైర్యంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తుదిశ్వాస వరకు పోరాడారు. బాపూజీ మరణ వార్త విని తెలంగాణవాదులతోపాటు అన్ని రాజకీయ, ప్రజాసంఘాల, కుల సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

హుటాహుటిన అశోక్‌నగర్‌ చౌరస్తాలోని బాపూజీ స్వగృహానికి చేరుకుని అంజలి ఘటించారు. బాపూజీతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీరుమున్నీరయ్యారు. తెల్లవారుజామునే లేచే బాపూజీ ప్రతిరోజు మాదిరిగానే అల్పాహారం తీసుకుని హాల్‌లో ఉన్న కుర్చీలో కూర్చొని టీవీ చూస్తుండగానే కుడిచేయి భుజాన నొప్పి వస్తుందని తన సహాయకుడు డ్రైవరెైన శ్రీనివాస్‌ తెలుపడంతో వెంటనే జండుబామ్‌ చేతికి రాసి మర్దన చేశాలడు. కొంత ఉపశమనం లభించడంతో అప్పుడే వచ్చిన దినపత్రికలను తీసుకు ని బాపూజీ చదువుతుండగా శ్రీనివాస్‌ మంచినీళ్ళు తీసుకురావడానికి బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి చేతిలో పేపర్‌తో బాపూజీ కుర్చీలో కూలిపోయి కనిపించారు. దీంతో కంగారు పడిన శ్రీనివాస్‌ నాన్నా నాన్నా అంటూ దగ్గరికెళ్ళి చూసేసరికి అప్పటికే బాపూజీ తుదిశ్వాస విడిచా రు. బాపూజీ మరణ వార్తను సిబ్బంది కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ వార్త దావానలంలా వ్యాపించింది. సమాచారం తెలుసు కున్న స్థానికులతోపాటు నగర నలుమూలల నుంచి పార్టీలక తీతంగా బాపూజీ స్వగృహానికి చేరుకున్న నేతలు బాపూజీ పార్థివ దేహాన్ని సందర్శించి పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు.

తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, సీఎం నల్లారితోపాటు పలువురి నివాళులు
స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి, సామాజిక ఉద్యమ పితామహుడు, తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ భౌతిక ఖాయాన్ని పలువురు రాజకీయ పార్టీల నేతలు సందర్శించి ఘన నివాళులు అర్పించారు. నివాళులు అర్పించినవారిలో సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య, డిప్యూటీ ముఖ్యమంత్రి రాజనర్సింహా, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి, లో్‌ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ, జాతీయ కార్యదర్శి డాక్టర్‌ లక్ష్మణ్‌ ఉన్నారు.

Saturday, August 18, 2012

టార్చర్ ఛాంబర్ల నుండి దేశాధ్యక్ష పదవి వరకూ…


టార్చర్ ఛాంబర్ల నుండి దేశాధ్యక్ష పదవి వరకూ…

కాళ్ళకూ, చెవులకూ ఎలక్ట్రిక్ షాక్ లు, బట్టలు ఊడడదీసి చేతులూ కాళ్ళూ కట్టేసి తలకిందులుగా వేలాడదీసి లాఠీలతో కుళ్లబోడవడం ఇవీ బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ నలభైయేళ్ల క్రితం ఎదుర్కొన్న చిత్రహింసలు. యుక్త వయస్సులో లెఫ్టిస్టు గెరిల్లా పోరాటంలో ఉండగా నియంతృత్వ ప్రభుత్వ పోలీసులకు పట్టుబడి మూడేళ్ళ చీకటి కారాగారవాసం అనుభవించిన దిల్మా రౌసెఫ్ తన గత జీవితాన్ని బహిరంగంగ ఇంతవరకూ ఏ పత్రికకూ, వ్యక్తులకూ చెప్పలేదు. ఎస్టెల్లా అనే యుద్ధ నామం (nom de guerre) తో గెరిల్లా యుద్ధంలో పాల్గొన్న దిల్మా టార్చర్ చాంబర్ల నుండి దేశాధ్యక్ష పదవి వరకూ ఎదగడం, ప్రజా జీవితం నుండి పాలకవర్గాలకు సేవకురాలుగా పరివర్తన  చెందిన ఫలితం.
బ్రెజిల్ లో 1964 నుండి 1985 వరకూ నియంతృత్వ పాలన సాగింది. ఆనాటి నియంతృత్వ పాలన ఛాయలు, విరోధాలు ఇప్పటికీ బ్రెజిల్ లో వివిధ రూపాల్లో కొనసాగుతున్నాయి. నియంతృత్వ పాలకులు ప్రజలపై సాగించిన దురన్యాయాలపై విచారణ చేయడానికి ప్రభుత్వం ట్రూత్ కమిషన్ నియమించింది. ట్రూత్ కమిషన్ విచారణ వల్ల అప్పటి అణచివేతలు, చిత్రహింసల కధలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. గుండెల్ని వణికించే ఆనాటి భయానక హింసల వివరాలు బ్రెజిల్ ప్రజల్లో కొంతమందికి పాత జ్ఞాపకాలు గుర్తుకు తెస్తుండగా, అనేకమందికి వారెరుగని చీకటి చరిత్రను విప్పి చూపుతున్నాయి.
చిత్రహింసల కొలిమి
అర్బన్ గెరిల్లా గ్రూపులో సభ్యురాలయిన దిల్మా 1970 లో నియంతృత్వ పాలకులకు పట్టుబడింది. పట్టుబడే నాటికి ఆమె వయసు 22 సంవత్సరాలే. 3 సంవత్సరాల పాటు ఆమె జైలులో అనుభవించిన  చిత్ర హింసల విషయం ఇప్పుడు ప్రముఖంగా చర్చించబడుతోంది. ఆమెను ఇంటరాగేట్ చేసిన వారు ఆమెను పదే పదే ఎలక్ట్రిక్ షాక్ లకు గురి చేశారనీ, కాళ్ళకూ, చెవులకూ వైర్లు తగిలించి షాక్ ఇచ్చేవారనీ, పూర్తి నగ్నం కావించి కాళ్ళూ చేతులూ కట్టేసి ఒక కర్రకు తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలకు గురి చేసేవారనీ తమకు అందిన సమాచారం ఆధారంగా పత్రికలు వెల్లడిస్తున్నాయి.
పోలీసు రికార్డుల్లో గెరిల్లాగా…
ఇంటరాగేషన్ లో దిల్మా ను హింసించినవారిలో 76 సంవత్సరాల మారిషియో లోపేస్ లీమా ఒకరు. అప్పటి మిలట్రీలో లెఫ్టినెంట్ కల్నల్ గా చేసిన లోపేస్, తనపై ఆరోపణలు నిజం కాదని చెబుతున్నప్పటికీ దిల్మా ను ‘మంచి గెరిల్లా’ గా మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. లోపేస్ లాంటి అనేకమంది మాజీ మిలట్రీ పాలకులను బ్రెజిల్ లోని హక్కుల సంఘాలు ఇతర ప్రజా సంఘాలు వెంటాడుతున్నాయి. బ్రెజిల్ వ్యాపితంగా అనేక నగరాలలోని వారి ఇళ్లను చుట్టుముడుతున్నారు. 1979 లో నియంతృత్వ ప్రభుత్వం ప్రకటించిన ‘క్షమాభిక్ష’ మాజీ మిలట్రీ అధికారులను ‘టార్చర్’ ఆరోపణలనుండి ఇప్పటికీ రక్షణ  కల్పిస్తోంది. అయినప్పటికీ గత మే నెలలో మొదలయిన ట్రూత్ కమిషన్ చీకటి చరిత్రను తవ్వితీస్తుండడంతో వారిని గతం వెన్నాడుతోంది. 400 మందికి పైగా ప్రజలను చంపిన బ్రెజిల్ నియంతృత్వ పాలకులు అనేకవేలమందిని చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
నియంతృత్వాలకు వ్యతిరేకంగా సాయుధ గెరిల్లా పోరాటాలు నడిపి అనంతరం రాజకీయ నాయకులుగా దేశాలను ఏలుతున్నవారిలో దిల్మా రౌసెఫ్ ఒంటరి కాదు. అమెరికా మద్దతుతో లాటిన్ అమెరికా దేశాలను ఏలిన అనేకమంది నియంతలు దేశ వనరులను అమెరికాకి అప్పజెప్పి ప్రజలను తమ హింసాత్మక పాలనలో అణచివేశారు. సదరు నియంతలకు ఎదురోడ్డి పోరాడిన వారు ఇతర దేశాల్లోనూ అధికారాన్ని చేపట్టారు. చిలీ మాజీ అధ్యక్షుడు మిచెల్లే బాచెలెట్ వారిలో ఒకరు. 1973 మిలట్రీ కుట్రతో అధికారం లాక్కున్న పినోచెట్ పాలనలో దారుణమైన నిర్బంధాన్ని ఎదుర్కొన్న బాచెలెట్ అనంతరం చిలీ అధ్యక్షుడు అయ్యాడు. ఉరుగ్వే అధ్యక్షుడు జోస్ ముజికా సైతం ‘తుపమారో గెరిల్లా ఆర్గనైజేషన్’ నాయకుడుగా అరెస్టయ్యి 14 సంవత్సరాల కారాగారంలో తీవ్ర హింసను అనుభవించాడు.
తన నిర్బంధ జీవితంపై దిల్మా ఇంతవరకూ మౌనాన్ని వీడలేదు. నియంతృత్వ బాధితురాలుగా గుర్తింపబడడానికి నిరాకరించడమే ఆమె మౌనానికి అర్ధం కావచ్చు. కానీ నియంత్రత్వం నీడలో సాగిన చీకటి చర్యలను వెలికితీయడానికి కృషిని ఆమె ప్రభుత్వం కొనసాగిస్తోంది. ది హిందూ కధనం ప్రకారం బహిరంగంగా ఆమె ఎన్నడూ తనపై సాగిన క్రూర నిర్బంధకాండను ప్రస్తావించలేదు. ట్రూత్ కమిషన్ గురించి మాట్లాడింది కూడా తక్కువే. కమిషన్ పై గానీ, తన జైలు జీవితం పైగానీ స్పందించడానికి ఆమె నిరాకరించినట్లు ‘న్యూయార్క్స్ టైమ్స్’ తెలిపింది. బల్గేరియన్ వ్యాపారికీ, బ్రెజిలియన్ స్కూల్ టీచర్ కీ జన్మించిన దిల్మా ఆర్ధికంగా ఒకింత ఉన్నత స్ధితిలోనే పరిగినప్పటికీ నియంతృత్వానికి వ్యతిరేకంగా ‘పల్మారెస్ ఆర్మ్ డ్ రివల్యూషనరీ వేన్ గార్డ్’ లో చేరి ఉద్యమంలోకి దూకింది.
మంచి గెరిల్లా
జైలు నుండి విడుదలయ్యాక పోర్టో అలెగ్రే నగరంలో ఆమె తిరిగి చదువు ప్రారంభించింది. 1976 లో కూతురు పుట్టాక స్ధానిక రాజకీయాల్లో ప్రవేశించింది. టెక్నోక్రాట్ గా ఎదుగుతూ జాతీయ ప్రాముఖ్యం సంపాదించింది. మాజీ అధ్యక్షుడు లూలా డి సిల్వా కు చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా, విద్యుత్ మంత్రిగా పని చేసి తన గురువు ప్రాపకంలో దేశాధ్యక్ష పదవిని అలంకరించింది. 2010 ఎన్నికల్లో లూలా పార్టీ తిరిగి ఎన్నిక కావాడానికి దిల్మా పైనే ఆయన ప్రధానంగా ఆధారపడ్డాడని చెబుతారు. టార్చర్ చాంబర్లలో దిల్మా అనుభవించిన చిత్రహింసల చరిత్ర ఈ కాలం అంతటా మరుగునే ఉండిపోయింది. నియంతృత్వాన్ని ఎదిరించిన మహిళల గురించి ఒక రచయిత పుస్తకం రాస్తున్న సందర్భంగా దిల్మా కొద్ది వివరాలను ఆ రచయితకు చెప్పడంతో 2005 లో కొన్ని వివరాలు వెల్లడయ్యాయి.
గురువు లూలా డిసిల్వా తో…
దిల్మా రౌసెఫ్ ను ‘మంచి గెరిల్లా’ గా చెబుతూనే ఆమెను హింసించిన విషయాన్ని లిమా లోపేస్ నిరాకరిస్తున్నాడు. ఇతర మాజీ మిలట్రీ పాలకులు సైతం ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. బ్రెజిల్ ఆర్మీ కి సెక్రటరీ జనరల్ గా పని చేసిన ‘ఎడ్వర్డో రోచా పైవా’ ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ దిల్మా విషయాన్ని ప్రస్తావించాడు. దిల్మా సాయుధ మిలిటెంటు గ్రూపులో పని చేసిందని, సోవియట్ తరహా నియంతృత్వాన్ని స్ధాపించాలని ఆ గ్రూపు కోరుకుందనీ చెప్పాడు. తిరుగుబాటుదారులు కూడా చిత్రహింసాలకు పాల్పడ్డారని వాదించాడు. “మిలట్రీ హయాంలో టార్చర్ జరిగిందా? అవును. బ్రెజిల్ లో ఈరోజు టార్చర్ ఉన్నదా? ఉంది” అని ఆయన వ్యాఖ్యానించాడు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ చర్యలకు తానెప్పుడూ పాల్పడలేదని దిల్మా చెప్పినా మాజీ మిలట్రీ అధికారుల వ్యాఖ్యలను ఖండించడానికి ఆమె ప్రయత్నించలేదు. అంతేకాక టార్చర్ బాధితులకు ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారం అందుకున్నవారిలో దిల్మా కూడా ఒకరు. ‘టార్చర్ నెవర్ ఎగెయిన్’ (టి.ఎన్.ఎ) అనే సంస్ధకు తనకు వచ్చిన 10,000 డాలర్లను ఇస్తానని ఆమె ప్రకటించింది కూడా. మిలట్రీ హింసలకు వ్యతిరేకంగా చైతన్యం పెంపొందించే లక్ష్యంతో ఏర్పరిచిన టి.ఎన్.ఎ కార్యాలయం ఇటీవల విధ్వంసానికి గురవడాన్ని బట్టి మాజీ మిలట్రీ నియంతల ప్రాపకంలో ఎదిగిన ధనికవర్గాల శక్తి తగ్గిపోలేదని అర్ధం చేసుకోవచ్చు.
ఎన్నికల ఉపన్యాసాల్లో గానీ, ప్రభుత్వ మీటింగుల్లో గానీ, వ్యక్తిగత సంభాషణల్లోగానీ ఏనాడూ తాను ఎదుర్కొన్న హింసను ప్రస్తావించని దిల్మా రౌసెఫ్ అంతరంగం కొన్ని పశ్చిమ పత్రికలకు కొరుకుడు పడని విషయం. కాగా, తమ హయాంలో చిత్రహింసలు నిజమేననీ, (ప్రజాస్వామ్యంగా చెప్పుకుంటున్న) ఇప్పటి హయాంలోనూ చిత్ర హింసలు నిజమేననీ నియంతృత్వ పాలన నాటి సైన్యాధికారులు ముక్తాయించడం దీనంతటికీ కొసమెరుపు. దేశ వనరులను దోచుకోవడానికి పాలకవర్గాలలో ఒకే గ్రూపు చేసే ప్రయత్నాలు నియంతృత్వం రూపం ధరిస్తే, ఇతర గ్రూపులకు కూడా దోచుకునే అవకాశం కల్పించడం ప్రజాస్వామ్యంగా చెప్పబడుతుందని బ్రెజిల్ నియంతృత్వ సైన్యాధికారుల ముక్తాయింపు విప్పి చెబుతున్న సత్యం. యుక్త వయస్సులో ప్రజలకోసం బతికినప్పటికీ అనంతరం దోపిడీ వ్యవస్ధలోనే టెక్నోక్రాట్ గా, రాజకీయవేత్తగా, దేశాధ్యక్షురాలిగా ఎదగడం ద్వారా దిల్మా రౌసెఫ్ తాను ప్రజల పక్షం నుండి పాలకవర్గాల పక్షం చేరిపోయాయని స్పష్టం చేసింది. అందుకే ఇప్పుడామె ‘మంచి గెరిల్లా’ గా మాజీ నియంతృత్వ ప్రభువుల చేత మన్ననలు అందుకుంటోంది.