హుటాహుటిన అశోక్‌నగర్ చౌరస్తాలోని బాపూజీ స్వగృహానికి చేరుకుని అంజలి ఘటించారు. బాపూజీతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీరుమున్నీరయ్యారు. తెల్లవారుజామునే లేచే బాపూజీ ప్రతిరోజు మాదిరిగానే అల్పాహారం తీసుకుని హాల్‌లో ఉన్న కుర్చీలో కూర్చొని టీవీ చూస్తుండగానే కుడిచేయి భుజాన నొప్పి వస్తుందని తన సహాయకుడు డ్రైవరెైన శ్రీనివాస్ తెలుపడంతో వెంటనే జండుబామ్ చేతికి రాసి మర్దన చేశాలడు. కొంత ఉపశమనం లభించడంతో అప్పుడే వచ్చిన దినపత్రికలను తీసుకు ని బాపూజీ చదువుతుండగా శ్రీనివాస్ మంచినీళ్ళు తీసుకురావడానికి బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి చేతిలో పేపర్‌తో బాపూజీ కుర్చీలో కూలిపోయి కనిపించారు. దీంతో కంగారు పడిన శ్రీనివాస్ నాన్నా నాన్నా అంటూ దగ్గరికెళ్ళి చూసేసరికి అప్పటికే బాపూజీ తుదిశ్వాస విడిచా రు. బాపూజీ మరణ వార్తను సిబ్బంది కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ వార్త దావానలంలా వ్యాపించింది. సమాచారం తెలుసు కున్న స్థానికులతోపాటు నగర నలుమూలల నుంచి పార్టీలక తీతంగా బాపూజీ స్వగృహానికి చేరుకున్న నేతలు బాపూజీ పార్థివ దేహాన్ని సందర్శించి పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు.
తమిళనాడు గవర్నర్ రోశయ్య, సీఎం నల్లారితోపాటు పలువురి నివాళులు
స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి, సామాజిక ఉద్యమ పితామహుడు, తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ భౌతిక ఖాయాన్ని పలువురు రాజకీయ పార్టీల నేతలు సందర్శించి ఘన నివాళులు అర్పించారు. నివాళులు అర్పించినవారిలో సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, డిప్యూటీ ముఖ్యమంత్రి రాజనర్సింహా, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి, లో్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ, జాతీయ కార్యదర్శి డాక్టర్ లక్ష్మణ్ ఉన్నారు.
No comments:
Post a Comment