2002లో పార్థసారధి ఎండీగా ఉన్న కేపీఆర్ టెలిప్రొడక్ట్స్ కంపెనీకి విదేశాల నుంచి కొన్ని యంత్రాలను దిగుమతి చేసుకున్నారు. దిగుమతి చేసుకునేటప్పుడు వాటికి సంబంధించిన సుంకాలు చెల్లించకపోవడంతో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి చార్జిషీటు దాఖలు చేసింది. నేరం రుజువు కావడంతో 2003లో ఆయనకు ఈడీ రూ. 3 లక్షలు జరిమానా విధించింది.
ఐతే ఆ జరిమానాను మంత్రి పార్థసారధి చెల్లించకపోగా, చెల్లించలేకపోతున్నందుకు గల కారణాలను కోర్టుకు విన్నవించలేదు. దీంతో నాంపల్లి కోర్టు పార్థసారధికి నాన్‌బెయిలబుల్ వారెంటును జారీ చేస్తూ, బుధవారం కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలన అందుకున్న మంత్రి కోర్టు ముందు హాజరయ్యారు.
No comments:
Post a Comment