త్వరలో జెనిటిక్ మాడిఫైడ్ దోమలు
- డెంగ్యూ,చికున్‌గున్యా వ్యాధులకు చెక్ పెట్టేందుకే
- దోమలకు రోగ నిరోధక శక్తి తగ్గించేందుకు జెన్‌టిక్ దోమల ప్రవేశం
- ఆడ దోమలపై జెనిటిక్‌మాడిఫైడ్ దోమల ప్రభావం
- పుట్టేవాటికి రోగనిరోధక శక్తి తక్కువ
- వైరస్‌తో మనిషిని కుట్టేలోపే దోమ చావు ఖాయం
- అమెరికా,బ్రిటన్‌లో సక్సెస్ రేట్ చూపిస్తున్న జీఎమ్ దోమలు
డెంగ్యూ, చికున్‌గున్యా వ్యాధులకు ఇకపై దేశంలో చెక్ పడబోతుంది. అంటే ఏదైనా కొత్తమందు కనుక్కొన్నారనుకుంటున్నారా..కాదులేండి. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధులను అరికట్టేందుకు దోమల జన్యు సిద్దాంతంపైనే దెబ్బకొట్టబోతున్నారు. ఇందుకు మన శాస్త్రవేత్తలు జెనిటిక్ మాడిఫైడ్ దోమలను పుట్టించబోతున్నారు . ఆ విశేషాలేంటో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరి.
డెంగ్యూ,చికున్‌గున్యా జ్వరాల ధాటికి దేశం అల్లాడిపోతుంది. ప్రతిఏడాది లక్షల్లో జనాలు డెంగ్యూ బారిన పడుతున్నారు. ఒక్క రాష్ట్రంలోనే ఈ ఏడాది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 1200మందికి డెంగ్యూ సోకినట్లు నిర్దారణ అయ్యింది. సుమారు 70మందికి చికున్ గున్యా సోకినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ దీనిని ఆందోళనకరమైన అంశంగానే పరిగణిస్తుంది. అయితే ఇక్కడే ప్రపంచ దేశాలకు ఓ ఐడియా వచ్చింది. ముల్లును ముల్లుతోనే తియ్యాలన్న సామెతలా దోమను దోమతోనే చంపేందుకు రంగం సిద్దం చేశారు. అసలు డెంగ్యూ, చికున్‌గున్యాలు ఎలా వస్తున్నాయనే దానిపై పరిశోధనలు చేసి అక్కడే నిర్మూలన చేపడితే బాగుంటుందన్న ఐడియాతో జన్యుపరమైన దోమలను పుట్టించేందుకు శ్రీకారం చుట్టారు. డెంగ్యూ,చికున్ గున్యాలు ముఖ్యంగా దోమల ద్వారానే వ్యాపిస్తుండటంతో వాటిమీదే ప్రయోగం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశ్యంతో ప్రపంచ దేశాలు కొత్తగా జెనిటిక్ మాడిఫైడ్ దోమలను సృష్టించాయి. ఇప్పటికే బ్రిటన్,అమెరికా లాంటి పెద్ద దేశాల్లో ఈ మాడిఫైడ్ దోమలు మంచి ఫలితాలనిస్తున్నాయి.
మామూలుగా డెంగ్యూ,చికున్‌గున్యాల జ్వరాలకు ఏడిస్‌ఎజిప్టీ అనే దోమలు కారణమవుతున్నాయి. దోమలు మనుషులను కుట్టేముందు వ్యాధి కారకాల వైరస్‌పై వాలినప్పడు వాటి ద్వారా డెంగ్యూ వ్యాపిస్తుంది. అయితే శాస్త్రవేత్తలు సృష్టించిన జీఎమ్ దోమలు...ప్రస్తుతం పర్యావరణంలో ఉన్న ఆడదోమలపై ప్రభావం చూపిస్తాయి. ఈ జెనిటిక్ దోమలకు మామూలు దోమలకన్నా...ఆకలి ఎక్కువ అవుతుంది. ఒక్కసారి ఆకలేస్తే ఆహారం సంపాదించేందుకు వీటికి శక్తి ఉండదు. క్షీణించుకు పోతాయి. దీంతో దోమల పునరుత్పత్తి చాలా వేగంగా తగ్గుముఖం పడుతుంది. మరోవైపు ఆడదోమలతో కలయిక జరిగినప్పుడు పుట్టే కొత్తదోమలు సృష్టించిన దోమలకున్న లక్షణాలుంటాయి. వీటికి రోగనిరోదక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో డెంగ్యూ,చికున్‌గున్యాలు వ్యాపించే వైరస్‌లు దోమలను చేరేసరికే....అవి తట్టుకోలేక మరణిస్తాయని శాస్త్రవేత్తలు చెప్తుతున్నారు. దీంతో ప్రమాదకర వైరస్‌లు మానవులను చేరేలోపే దోమల్లోనే అంతమొందించవచ్చని పరిశోధనల్లో వెల్లడయ్యింది. ప్రస్తుతం బ్రిటన్‌కు చెందిన ఆక్సిటిక్ అనే కంపెనీ ఈ జెనిటిక్ దోమలను సృష్టిస్తుంది. బ్రిటన్‌లో ఏకంగా ఓ ల్యాబ్‌లో వీటిని పుట్టించి బయట ప్రదేశాల్లోకి ఇతర దోమలపై వదులుతున్నారు.ప్రస్తుతం ప్రపంచదేశాలు మొత్తం ఈ జీఎమ్ దోమల సృష్టిపై దృష్టిసారించాయి. ప్రస్తుతం దేశంలో కూడా ఆక్సోటిక్ కంపెనీ ఇక్కడున్న కంపెనీతో ఎమ్‌ఓయూ కుదుర్చుకోవడానికి సిద్ధమయ్యింది. ఇదంతా మరో నాలుగు నెలల్లో పూర్తవుతుంది. ఇది కనుక ఓకే అయితే దేశంలో ఉన్న దోమల జాతికి ఇక కష్టకాలమే.

No comments:
Post a Comment