Wednesday, July 25, 2012

హిల్లరీ క్లింటర్‌ అరుదైన రికార్డు

హిల్లరీ క్లింటర్‌ అరుదైన రికార్డు సృష్టించారు. మూడేళ్ళలో ఆమె ప్రపంచాన్ని చుట్టేశారు. 102 దేశాలతో దౌత్య సంబంధాలు జరిపారు. ఎంతదూరమైన, ఎక్కడి నుంచి ఎక్కడికైనా విసుగు, విరామం లేకుండా ప్రయాణిస్తూనే ఉన్నారు.విదేశీ పర్యటనల్లో అమెరికా విదేశాంగ శాఖా మంత్రి హిల్లరీ క్లింటన్‌ రికార్డు క్రియేట్‌ చేశారు. అలుపు, సొలుపూ లేకుండా 102 దేశాలు పర్యటించారు. లక్షల కిలోమీటర్లు గాల్లో చక్కర్లు కొట్టారు. యూరప్‌ నుంచి ఆసియాకు, అక్కడి నుంచి మధ్య ప్రాచ్యానికి ఎన్నోసార్లు టూరేశారు. ఫ్రాన్స్‌, ఆఫ్గనిస్తాన్‌, జపాన్‌, మంగోలియా, వియత్నాం, లావోస్‌, కంబోడియా, ఈజిస్ట్‌, ఇజ్రాయేల్‌, ఇండియా, పాకిస్థాన్‌ ఎలా చెప్పుకొంటే వందకు పైగా దేశాలతో ఆమె దౌత్య సంబంధాలు నెరిపారు. ఐదు పదుల వయసులోనే అలుపన్నదే లేకుండా ప్రయాణాలు చేశారు. అమెరికా ప్రతినిధిగా ప్రపంచంలోని అనేక దేశాధినేతలతో మంతనాలు జరిపారు. ఇది కూడా తక్కువ వ్యధిలోనే. 2009 నుంచి 351 రోజుల్లో 102 దేశాలు చుట్టి వచ్చారు. ఇప్పటి వరకు ఆమె 8 లక్షల 43 వేల, 839 మైళ్ళ ప్రయాణం పూర్తి చేశారు. ఇటీవలే 13 రోజుల పర్యటనలో ఆమె 27 వేల మైళ్ళు చుట్టివచ్చారు. అంటే 43,450 కిలోమీటర్లు. ఇది భూమి చుట్టికొలత కన్నా రెండు మైళ్ళు ఎక్కువ.అమెరికా చరిత్రలో ఇన్ని దేశాల్లో పర్యటించిన మంత్రి ఒక్క హిల్లరీనే. గతంలో 98 దేశాలు తిరిగొచ్చిన అల్‌బ్రైట్‌ రికార్డును హిల్లరీ క్రాస్‌ చేశారు. అయితే ఇంకా ఎన్ని ప్రయాణాలు చేసేందుకైనా రెడీ అంటున్నారు హిల్లరీ.

No comments:

Post a Comment