Friday, July 27, 2012

భారీ వరదలతో అతలాకుతలమైన చైనా: 77 మంది మృతి


China
చైనా రాజధాని నగరం బీజింగ్‌లో గత 60 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఇంతవరకు 77 మంది మృతి చెందారు. చైనాలోని పలు జిల్లాల్లో గత వారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే బీజింగ్ నగరంలో రెండు రోజుల పాటు కురుస్తున్న వర్షంతో బుధవారం మాత్రం 21 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. 

భారీ వర్షాల కారణంగా విద్యుత్, టెలికాం సేవలు పూర్తిగా స్తంభించాయి. నివాస స్థలాల్లోనూ షాపింగ్ కాంప్లెక్సుల్లోనూ వరద నీరు ప్రవేశించింది. బీజింగ్‌లోని పలు ప్రాంతాలు గుర్తు తెలియని విధంగా వరదల్లో మునిగిపోయాయి. ఇంకా ఈ వర్షం కొనసాగితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. 

కాగా చైనా భారీ వర్షాలకు ఇప్పటి వరకు 77 మంది మరణించినట్లు చైనా న్యూస్ ఏజెన్సీలు తెలియజేస్తుండగా, ప్రభుత్వం మాత్రం 37 మంది మృతి చెందినట్లు ప్రకటించింది.

No comments:

Post a Comment