సమాజ్‌వాదీ కార్యకర్తలే చేశారన్న బీఎస్పీ
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్ర: సీఎం అఖిలేష్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మాయావతి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గురువారం జరిగిన ఈ ఘటనతో లక్నో నగరం ఉద్రిక్తంగా మారింది. గుర్తు తెలియని యువకులు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మాయావతి విగ్రహాన్ని సుత్తితో ధ్వంసం చేసి, పరారైనట్టు పోలీసులు తెలిపారు. ‘గోమతీ నగర్‌లోని అంబేద్కర్ సామాజిక్ పరివర్తన్ స్థల్‌లో ఏర్పాటు చేసిన దాదాపు నాలుగు అడుగుల ఎత్తున్న పాలరాతి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం తలను విరిచేసి, చేతులను ధ్వంసం చేశారు’ అని సీనియర్ పోలీసు అధికారి వివరించారు. కాగా, విగ్రహాన్ని ధ్వంసం చేసింది తామేనని ఉత్తరప్రదేశ్ నవ నిర్మాణ్ సేన అనే చిన్న రాజకీయ పార్టీ ప్రకటించింది.
మాయావతి హయాంలో చోటుచేసుకున్న కుంభకోణాలకు వ్యతిరేకంగా తామీ పనిచేశామని తెలిపింది. లక్నో, నోయిడాల్లో ఉన్న మాయావతి విగ్రహాలన్నింటినీ 72 గంటల్లోగా తొలగించాలని, లేదంటే తామే ఆ పని చేస్తామని నవ నిర్మాణ్ సేన ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఘటనా స్థలంలో సేనకు సంబంధించిన కరపత్రాలు పడి ఉన్నాయని, కనుక ఇది వారి పనే అయి ఉంటుందని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
అయితే తమ నాయకురాలి విగ్రహాన్ని సమాజ్‌వాదీ కార్యకర్తలే ధ్వంసం చేశారని బీఎస్పీ ఆరోపించింది. యూపీలోని ఝాన్సీ, అంబేద్కర్ నగర్, దేవ్‌రియా, ముజఫర్‌నగర్, కాన్పూర్‌లలో బీఎస్పీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. కాగా, ఈ సంఘటనను యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తోపాటు సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కూడా ఖండించారు. రాష్ట్రంలో సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసే కుట్రతో ఎవరో పథకం ప్రకారం ఇదంతా చేశారని సీఎం అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ధ్వంసమైన మాయావతి విగ్రహానికి వెంటనే మరమ్మతులు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

No comments:
Post a Comment