Tuesday, July 24, 2012

ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ : దేశ ప్రథమ పౌరుడిగి ప్రణబ్ ముఖర్జీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కపాడియా ఈరోజు ఉదయం 11.30 గంటలకు పార్లమెంట్ భవన్ లో ప్రణబ్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మన్మోహన్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, సోనియాగాంధీ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, మాజీ రాష్ట్రపతులు ప్రతిభాపాటిల్,అబ్దుల్ కలాం, కేంద్రమంత్రులు, పలువురు ఎంపీలు హాజరయ్యారు. అంతకు ముందు ప్రణబ్ త్రివిధ దళల గౌరవ వందనాలు స్వీకరించారు.

No comments:

Post a Comment