వందేళ్ల రికార్డును మహిళలు బద్దలు కొట్టారు.
మహిళలే మేధావులు
లండన్ : వందేళ్ల రికార్డును మహిళలు బద్దలు కొట్టారు. ఐక్యూ విషయంలో ఇన్నేళ్ల కాలంలో పురుషులదే పై చేయిగా ఉండేది. ఆ రికార్డును మహిళలు బ్రేక్ చేశారని సైకాలజిస్టులు వెల్లడించారు. కొత్త అధ్యయనంలో వెల్లడైన ఈ విషయాలను ఐక్యూ పరీక్షల నిర్వహణలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జేమ్స్ ఫ్లిన్ ఒక బ్రిటిష్ పత్రికలో ప్రచురించారు. పురుషులతో పోలిస్తే సుమారు ఐదు పాయింట్ల వరకు మహిళలు వెనుకబడి ఉండేవారు. ఈ తారతమ్యం క్రమేపి తగ్గుతూ వచ్చింది. ఈ ఏడాదిలో ఆ బేధాన్ని మహిళలు అధిగమించి పురుషులకన్నా ఎక్కువ ఐక్యూ స్థాయికి వారు చేరుకున్నారు. దీనికి కారణం బహుళ లక్ష్యాలను సాధించే శక్తిసామర్ధ్యాలు మహిళలకు ఉండటమే నంటున్నారు సైకాలజిస్టులు. పశ్చిమ యూరప్, యూఎస్‌ఏ, కెనడా, న్యూజిలాండ్, అర్జెంటీనా, ఈస్టోనియా దేశాలలో ఐక్యూ పరీక్షలు నిర్వహించారు.
No comments:
Post a Comment