Friday, July 27, 2012

లండన్ ఒలింపిక్స్‌కు శ్రీకారం


జిగేల్‌మన్న ప్రధాన స్టేడియం
హాజరైన వివిధ దేశాల ప్రముఖులు
నేటి నుంచి ఆటల సందడి

లండన్: ప్రపంచ దేశాల క్రీడా సంరంభం అంగరంగ వైభవంగా ఆరంభమయింది. దేశ దేశాల మధ్య క్రీడా సమరానికి బ్రిటన్ రాజధాని లండన్ నగరం వేదికగా.. ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు అద్భుత రీతిలో మొదలయ్యాయి. బ్రిటన్ కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక) లండన్‌లోని ఒలింపిక్ పార్కులో అశేష జనవాహిని సమక్షంలో కళ్లుమిరుమిట్లు గొలిపే కాంతులు వెదజల్లుతూ క్రీడా సంరంభం మొదలయింది. ఈ వేడుకలకు ఆస్కార్ అవార్డు గ్రహీత డానీబోయెల్ రూపకల్పన చేశారు. 19 రోజుల పాటు జరిగే పోటీలు 34 స్టేడియంలలో జరుగుతాయి. 204 దేశాల క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటున్నారు. ఈసారి 81 మంది భారత క్రీడాకారులు ఒలింపిక్స్ పతకాల వేటకు లండన్ బరిలో దిగుతున్నారు. షూటింగ్, బాక్సింగ్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టెన్నిస్‌లతో సహా మొత్తం 13 విభాగాల్లో తలపడనున్నారు. 

No comments:

Post a Comment