Thursday, July 26, 2012

అసోంలో ఘర్షణలు: 40కి చేరిన మృతుల సంఖ్య

అసోంలో ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘర్షణలో మరణించిన వారి సంఖ్య 40కి చేరింది. అసోంలోని కోక్రాఝార్ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం మైనార్టీ వలస దారులకు, బోడో గిరిజనులకు మధ్య మొదలైన ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, అసోం అల్లర్లలో బంగ్లాదేశీయుల హస్తం లేదని కేంద్రం స్పష్టం చేసింది. 

కోక్రాఝార్, చిరాంగ్, ఢుబ్రి, బోంగాయ్‌గావ్ జిల్లాల్లో 13 కాలమ్‌ల సైనిక బలగాలను నియమించామని, వీరు ఫ్లాగ్ మార్చ్ సైతం జరిపారని ఒక జిల్లా కలెక్టర్‌తో కలిసి విలేఖరులతో మాట్లాడిన రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ ఎస్ ఫోగత్ చెప్పారు. ఈ అల్లర్ల కారణంగా 2 లక్షల మంది నిరాశ్రయులు కాగా, వీరికోసం 125 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసారు. 

కాగా, అసోంలోని ప్రాంతంలో చెలరేగిన జాతి కలహాలతో సంబంధం ఉన్న రింగ్ లీడర్లను తక్షణం పట్టుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ అల్లర్లలో బంగ్లాదేశీల హస్తం లేదని స్పష్టం చేసింది.

No comments:

Post a Comment