ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ఇందిరమ్మ బాట సక్సెస్ కావడంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు చేరుతున్నాయా లేదా అనే అంశాలపై ఈ ఇందిరమ్మ బాటలో సమీక్షిస్తారు.
శ్రీకాకుళం జిల్లాలో ఇందిరమ్మ బాట 3 రోజుల పర్యటనలో భాగంగా అక్కులపేట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రైతులు, మహిళా గ్రూపులతో సమావేశమవుతారు. సాయంత్రం ఇందిర జలప్రభ పర్యవేక్షణ, లబ్దిదారులతో చర్చించి అక్కడ నుంచి సీతంపేట పెదరామ గ్రామానికి చేరుకుని గిరిజన కుటుంబాలతో ముచ్చటిస్తారు. శుక్రవారం రాత్రికి మల్లిలోని సాంఘిక సంక్షేమ వసతి పాఠశాలలో బస చేస్తారు.
రెండో రోజు సీఎం పాతపట్నం చేరుకుంటారు. ఇక్కడ చేనేత కార్మికులు, గృహ నిర్మాణ లబ్దిదారులు, బీడీ కార్మికులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బస చేసి మూడో రోజు పెదపాడులోని సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థినులతో అల్పాహారం తీసుకుంటారు. ఇంకా రిమ్స్ పనుల పరిశీలన, జిల్లా అభివృద్ధిపై సమీక్ష, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
No comments:
Post a Comment