శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జరిగిన ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భాంగా ఆయన మాట్లాడుతూ పొలవరం ప్రాజెక్టుపై కొందరు అనవసర వ్యాఖ్యాలు చేస్తున్నారన్నారు. జలయజ్ఞం ద్వారా రాష్ట్రంలో 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని, రానున్న రెండేళ్లలోమరో 30 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే మరికొన్ని లక్షల ఎకరాలకు సాగునీటిని అందజేయడంతో పాటు.. అనేక వందల గ్రామాలకు మంచినీటిని సరఫరా చేయవచ్చన్నారు. అలాగే, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు కూడా తాగునీరు ఇవ్వొచ్చన్నారు. ఇకపోతే... రాష్ట్రంలో క్రీడల అభివృద్దికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రాష్ట్రంలో మినీ స్టేడియాల నిర్మాణం కోసం ప్రతి జిల్లాకు రూ.1.24 కోట్లు విడుదల చేశామని సీఎం తెలిపారు
No comments:
Post a Comment