Tuesday, July 24, 2012

మైనర్‌తో శృంగారం..భారత సంతతి టీచర్‌కు జైలు

న్యూయార్క్:


మైనర్‌తో శృంగారంలో పాల్గొన్నందుకు అమెరికాలో లీనాసిన్హా(46) అనే భారత సంతతి టీచర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసులో 2007లోనే లీనా దోషిగా తేలినప్పటికీ వివిధ కోర్టుల్లో ఆమె అప్పీళ్లకు వెళ్లడంతో శిక్ష ఆలస్యమైంది. చివరకు ఆమె తన నేరాన్ని అంగీకరించడంతో శిక్ష ఖరారైంది. తనకు విధించిన శిక్షను తగ్గించాలంటూ ఆమె చేసిన విజ్ఞప్తిని న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. 1996లో తన కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న మాంటెస్సోరి స్కూల్‌లో లీనా హెడ్‌మిస్ట్రెస్‌గా పనిచేసేది. ఆ సమయంలో ఓ 13 ఏళ్ల విద్యార్థితో ఆమె ముఖరతి (ఓరల్ సెక్స్)లో పాల్గొంది.

No comments:

Post a Comment